
ఓ సినిమాలో డైలాగ్..పందులే గుంపుగా వస్తాయి.. సింహం సింగిల్‌గా వస్తుంది అని..ఈ సింహం దాన్ని బాగా నమ్మేసినట్లు ఉంది..సింగిల్‌గానే వెళ్లింది..అప్పుడు ఏం జరిగిందంటే..
మొన్నీమధ్యే..కెన్యాలోని లేక్ నకురు నేషనల్ పార్కులోఊసుపోని సింహం ఒకటి ఊరి మీదకు బయల్దేరిందిఇలా ఇంటి మలుపు తిరిగిందో లేదో..అడవి గేదెల గుంపు ఒకటి ఎదురైంది..
అసలే సింహం.. ఆపై కామన్‌సెన్స్ తక్కువ..పైగా.. ఎక్కడ నెగ్గాలో..ఎక్కడ తగ్గాలో తెలియదు..దాంతో ఏయ్ అన్నట్లు చూసింది..అవి పోపోవోయ్ అన్నాయి..ఇది గుర్రుమంది.. అంతే.. వాటికి కాలింది..
పాత కక్షలు ఏమైనా ఉన్నాయో ఏమో తెలియదుగానీ..ఒక్కసారిగా మీదకు ఉరికాయి.. సింహానికి తత్వం బోధపడింది..కస్సుమన్నది కాస్త.. కాలికి పనిచెప్పింది.. చేసేదిలేక ఇలా చెట్టెక్కి కూర్చుంది..
సింహం కళ్లలో భయం చూశాక.. గేదెల ఈగో శాటిస్‌ఫై అయినట్లుంది..దీంతో పోనీలే అని దాన్ని వదిలేసి.. వార్నింగులు గట్రా ఇచ్చేసి..ఇంటి దారి పట్టాయి.(ఈ చిత్రాలను ముంబైకి చెందిన ఫొటోగ్రాఫర్ నీలోత్పల్ బారువా క్లిక్‌మనిపించారు.)
Comments
Please login to add a commentAdd a comment