
సింహాన్ని పిల్లి ఎలా సవాల్ చేసిందో చూడండి!
మృగరాజును సవాల్ చేయడం సాధ్యమేనా.. మనుషుల సంగతి పక్కన పెడితే.. ఏ జంతువు కూడా సింహాన్ని ఢీకొట్టే సాహసం చేయలేదు.
టెక్సాస్: మృగరాజును సవాల్ చేయడం సాధ్యమేనా.. మనుషుల సంగతి పక్కన పెడితే.. ఏ జంతువు కూడా సింహాన్ని ఢీకొట్టే సాహసం చేయలేదు. అదుపుతప్పితే గజరాజు సైతం మృగరాజు చేతిలో చావు దెబ్బ తినాల్సిందే. అలాంటింది ఒక చిన్న పిల్లి సింహంపైకి తొడకొట్టి దూసుకెళ్లినంత పనిచేసింది. ఒక్కసారి కాదు.. పలుమార్లు సింహాన్ని రెచ్చగొట్టింది. పిల్లి వేషాలకు సింహం కూడా ఒకనొక సందర్భంలో భయపడిందంటే ఆశ్చర్యపోక తప్పదు.
అసలు అంత ధైర్యంగా ఆ పిల్లి ఆ పని ఎలా చేసిందబ్బా అని అనుకుంటున్నారా? మరేం లేదు ఆ సింహం చుట్టూ ఇనుప కంచెను అల్లేసిన పెద్ద బోనులో ఉండిపోయింది. పిల్లి బోనుకు ఇవతల ఉంది. టెక్సాస్‌లో ఈ సంబ్రమాశ్చర్యం గొలిపే సంఘటన చోటుచేసుకుంది. టెక్సాస్‌లో ది సెంటర్‌ఫర్ యానిమల్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఉంది. అందులో దేరేక్ క్రాన్ అనే వ్యక్తికి బ్యాగీ అనే ఓ పెంపుడు పిల్లి ఉంది. దానిని గాండ్రుమని గర్జిస్తూ బోనులో తిరుగుతున్న నోయే అనే మృగరాజుపైకి ఉసిగొలిపి దేరేక్ విడిచిపెట్టాడు. దీంతో ఆ పిల్లి వేగంగా సింహంవైపు దూసుకెళ్లింది. అయితే, ఆ సింహం పిల్లిన భయపెడుదామనుకునే లోగానే పిల్లే ఆ పని చేసి సింహాన్ని కొన్ని సెకన్లపాటు అదిరిపోయి ఆగిపోయేలా చేసింది. యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్న ఈ వీడియో ఇప్పుడు పలువురుని తెగ ఆకట్టుకుంటోంది.