బిడ్డలపై ప్రేమ లేని తల్లి ఉంటుందా అంటే.. సమాధానం చెప్పడం చాలా కష్టం. ఏ తల్లి అయినా తన బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటుంది. మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోనూ తల్లిప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. దీనికి నిదర్శనం ఈ వీడియోనే. తన బిడ్డను నది దాటించే క్రమంలో ఓ ఆడసింహం చేసిన పని అందరిని ఆశ్చర్యపరిచింది. నదిలోని మొసళ్లు ఎక్కడ తన బిడ్డలను మింగేస్తాయోనని చూసుకుంటూ.. జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చింది ఆ ఆడ సింహం. నది దాటే క్రమంలో పిల్ల సింహం ఒక్క క్షణం నిటిలో మునిగితే చాలు.. వెంటనే నోటితోపైకి లాగుతోంది.
తన బిడ్డను మొసలి మింగేసిదన్న భయంతో వెంటనే అప్రమత్తమై పిల్ల సింహాన్ని నోటితో పైకి లాగుతోంది. ఈ అసాధారణ దృశ్యం కెన్యాలోని ఎవాసో వద్దగల నైరో నది సమీపంలో చోటు చేసుకోగా.. లుకా బ్రాకాలి అనే ప్రముఖ ఫోటో గ్రాఫర్ తన కెమెరాలో బంధించారు.ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ‘తల్లి ప్రేమను మించింది లేదు’., ‘ సింహం అయినా కూడా ఓ బిడ్డకు తల్లియే కదా’ అని కామెంట్లు పెడుతున్నారు.