అహ్మదాబాద్: సాధారణంగా చిరుతపులులను చూస్తే సింహాలు వేటాడతాయి. అయితే గుజరాత్‌లో ఓ ఆడ సింహం చిరుత పులి పసికూనను కంటికి రెప్పలా చూసుకుంటూ దానికి పాలు కూడా ఇస్తోంది. ఇలా జరగడం చాలా అసాధారణమని అటవీ అధికారులు చెబుతున్నారు. నెలన్నర వయసున్న చిరుతకూన గిర్ అడవిలో ఎలానో తన తల్లి నుంచి వేరుపడింది. దీనిని సింహం అక్కున చేర్చుకుంది. తన పిల్లలతోపాటే దీనికీ పాలిస్తూ, మగ సింహాల దాడి నుంచి కాపాడుతోంది. వారం క్రితం ఈ వింతను అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కూడా విడుదల చేశారు. ‘చిరుతపులి పిల్లపై ఈ సింహం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ కాపాడుతోంది. అలాగే సింహం సంకేతాలు, శబ్దాలను పులి పిల్ల ఎలా అర్థం చేసుకుంటుందోనని మేం ఆశ్చర్యపోతున్నాం. ఏదేమైనా ఇది చాలా అరుదైన ఘటన’ అని గిర్ అడవి పశ్చిమ విభాగ కన్జర్వేటర్ ధీరజ్ మిత్తల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment