Viral Video Fearless Dog Stares Down Mountain Lion: ఒక్కోసారి జంతువులు చేసే పనులు చూస్తే మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. పైగా వాటికంటే బలమైన జంతువులు ముందు ఏ మాత్రం భయంలేకుండా సంచరించి మనకే భయం కలిగించేలా ప్రవర్తిస్తాయి. అచ్చం అలాంటి ఘటనే జర్మనీలోని కాన్యన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
(చదవండి: ఆ షార్క్ చేప వాంతి చేసుకోవడంతోనే మిస్టరీగా ఉన్న హత్య కేసు చిక్కుముడి వీడింది!!)
అసలు విషయంలోకెళ్లితే... జర్మనీలోని కాన్యన్ రాష్ట్రంలో సారా అనే ఆమె ఇంటి వద్ద ఉన తన పెంపుడు కుక్క అద్దాల గదిలో ఆడుకుంటూ ఉంటుంది. ఇంతలో ఎటు నుంచి వచ్చిందో గానీ ఒక అడవి సింహం వస్తుంది. అది నేరుగా ఆ కుక్క ఉన్న అద్దాల గది వద్దకు వస్తుంది. అయితే ఈ కుక్క ఆ సింహాన్ని చూసి ఏ మాత్రం భయపడకుండా డేర్‌గా నిలబడుతుంది. ఆ రెండిటికి మధ్య ఆ అద్దాల తలుపు మాత్రమే అడ్డం. పైగా ఆ కుక్కని యజమాని సారా వెనక్కి రమ్మని ఎంతగా పిలిచిన వినకుండా అక్కడ నుంచుని ఆ సింహాన్ని చూస్తోంది.
అయితే ఆ సింహం కూడా ఆ కుక్క దగ్గరకు వచ్చి నిలబడటమే కాక ఆ తలుపుని తీయడానికి తెగ ప్రయత్నిస్తుంది. అయితే అవి రెండు ఒకరినొకరు చాలా సేపటి వరకు చూసుకుంటారు. ఈ మేరకు కుక్క దాన్ని భయపెట్టేలా అరుస్తుండటం విశేషం. ఆ తర్వాత ఆ సింహం అక్కడ నుంచి వెళ్లిపోతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోని సారా "చిల్లింగ్ ఎన్‌కౌంటర్" అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీరు ఓ లుక్ వేయండి.
(చదవండి: అఫ్ఘాన్ బాలికలు విద్యనభ్యసించేలా బలమైన యూఎస్ మద్దతు కావాలి!)
Comments
Please login to add a commentAdd a comment