ఈ ఫోటోలో ఉన్న సూపర్‌స్టార్ల పేర్లు తెలుసా: షారూఖ్‌ | Shah Rukh Khan Poses With Jackie Chan Jean Claude Van Damme In Riyadh | Sakshi

నా హీరోలను కలిశాను: షారూఖ్‌

Oct 14 2019 6:29 PM | Updated on Oct 14 2019 6:46 PM

Shah Rukh Khan Poses With Jackie Chan Jean Claude Van Damme In Riyadh - Sakshi

ముంబై : బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌ ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఎంజాయ్‌ చేస్తున్నారు. అక్కడ  సౌదీ అరేబియా చిత్ర పరిశ్రమ నిర్వహించిన ‘జాయ్‌ ఫోరయ్‌ 2019’ కార్యక్రమంలో షారుఖ్‌ పాల్గొన్నారు. సౌదీలోని రియాద్‌లో జరుగుతున్న ఈ వేడుకల్లో ఆదివారం హాలీవుడ్‌ స్టార్‌ జాసన్ మొమోవా, హాంకాంగ్‌ యాక్షన్‌ హీరో జాకీచాన్‌, బెల్జీయం నటుడుజీన్-క్లాడ్ వాన్ డామ్మేలను కలుసుకున్నారు. వారితో కలిసి దిగిన ఫోటోలను తాజాగా షారూఖ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. 

‘ఆనందాలు అన్ని నావే.. నా హీరోలను కలిశాను’ , ‘ఈ ఫోటోలో ఉన్న సూపర్‌స్టార్‌ పేర్లు తెలుసా’.. అనే ట్యాగ్‌లతో షారూఖ్‌ షేర్‌ చేసిన ఈ ఫోటోలు తన అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు  అభిమానులు షేర్‌ చేసిన ఓ వీడియోలో షారుఖ్‌  తన హీరోలను కలిసే అవకాశాన్ని కల్పించినందుకు కార్యక్రమ నిర్వాహకులకు ధన్యవాదాల తెలిపారు. అలాగే తన ఆరేళ్ల కుమారుడైన అబ్రామ్‌.. జాస​న్‌ అభిమానని షారుఖ్‌ తెలిపారు.  ఏప్రిల్‌లో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుఖ్‌ మాట్లాడుతూ.. జీరో వైఫల్యం  నన్ను కాస్తా నిరాశ పరిచింది. దీని నుంచి బయట పడటానికి నాకు కొంచెం సమయం కావాలి. ఈ మధ్యలో సినిమాలు చూడటానికి, పుస్తకాలు చదవడానికి, అలాగే నా కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నాను. అని తెలిపారు. 

 సొంత నిర్మాణ సంస్థలో వచ్చిన ‘జీరో’ సినిమా అనంతరం బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ ఇంతవరకు ఏ సినిమాను ఓకే చేయలేదు.  అనుష్కశర్మ, కత్రినాకైఫ్‌ హిరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫిస్‌ వద్ద చతికిలపడిన విషయం తెలిసిందే. దాదాపు 200 కోట్లతో నిర్మించిన ఈ సినిమాకు రూ.100 కోట్ల కనెక్షన్లు కూడా రాలేదు. అయితే సినిమాల విషయం పక్కకు పెడితే షారుఖ్‌ బిజీ బిజీగానే గడుపుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement