
ఫైల్ ఫొటో
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్ క్రీడాకారిణి అంకిత రైనా రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 182వ ర్యాంకర్ అంకిత 2 గంటల 9 నిమిషాల్లో 3–6, 6–1, 6–4తో ప్రపంచ 169వ ర్యాంకర్ అనస్తాసియా రొడియోనోవా (ఆస్ట్రేలియా)పై గెలిచింది.
వర్షం పలుమార్లు అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో అంకిత నెట్‌వద్దకు 27 సార్లు దూసుకొచ్చి 18 సార్లు పాయింట్లు సంపాదించింది. తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయిన అంకిత ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. రొడియోనోవా పది డబుల్‌ఫాల్ట్‌లతోపాటు 39 అనవసర తప్పిదాలు చేసింది. రెండో రౌండ్‌లో ప్రపంచ 125వ ర్యాంకర్ గ్రీట్ మినెన్ (బెల్జియం)తో అంకిత ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment