ఆసీస్ హ్యాట్రిక్ | Cricket T20 Women's World Cup 2014: England suffer ... | Sakshi
Sakshi News home page

ఆసీస్ హ్యాట్రిక్

Published Mon, Apr 7 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 5:40 AM

ఆసీస్ హ్యాట్రిక్

ఆసీస్ హ్యాట్రిక్

 ఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయం
 మహిళల టి20 ప్రపంచకప్
 
సాక్షి, ఢాకా: పురుషుల విభాగంలో ఇప్పటివరకూ ఎవరూ సాధించని ఘనతను ఆస్ట్రేలియా మహిళల జట్టు సాధించింది. వరుసగా మూడోసారి మహిళల టి20 ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకూ నాలుగుసార్లు ఈ టోర్నీ జరిగితే ఆసీస్ మహిళలు వరుసగా 2010, 2012, 2014లలో టైటిల్స్ సాధించారు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్లతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది.
 తొలుత ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 105 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో కోయ్‌టే (3/16), పెర్రీ (2/13) అద్భుతంగా బౌలింగ్ చేశారు. తర్వాత ఆస్ట్రేలియా జట్టు 15.1 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ లానింగ్ (44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), పెర్రీ (31 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. ఆసీస్ బౌలర్ కోయ్‌టేకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.... ఇంగ్లండ్ బౌలర్ షబ్‌స్రోల్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement