హైదరాబాద్ మహిళల ఓటమి | hyderabad womens team lost the match | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ మహిళల ఓటమి

Published Wed, Oct 12 2016 3:03 PM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM

hyderabad womens team lost the match

రాయ్‌పూర్: సీనియర్ మహిళల వన్డే లీగ్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ మహిళల జట్టు బరోడా చేతిలో పరాజయం చవిచూసింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో బరోడా గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 47.3 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌటైంది.
 
  ప్రణతి రెడ్డి (40) మినహా మిగతా బ్యాట్స్‌వుమెన్ నిరాశపరిచారు. బరోడా బౌలర్లలో ప్రజ్ఞారావత్, ఎస్.ఆర్.శర్మ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన బరోడా జట్టు 47.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి గెలిచింది. వై.హెచ్.భాటియా 40 పరుగులు చేయగా, హైదరాబాద్ బౌలర్ గౌహర్ సుల్తానాకు 4 వికెట్లు దక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement