
అరుందతీ రెడ్డి (ఫైల్ ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ : ఐసీసీ మహిళల వరల్డ్ టీ-20 ప్రపంచ కప్ కోసం ఆల్ ఇండియా విమెన్స్ సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. జట్టులో మరో హైదరబాద్ అమ్మాయి అరుందతీ రెడ్డికి అవకాశం దక్కింది. ఇటీవల శ్రీలంక తో జరిగిన టీ20 సిరీస్‌లో అరుందతీ రెడ్డి రాణించిన విషయం తెలిసిందే. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో 15 మందితో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. హర్డ్ హిట్టర్ స్మృతి మంధాన జట్టుకి వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
నవంబర్ 9 నుంచి 24 వరకు ఈ టోర్నీ వెస్టిండీస్ వేదికగా జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం పది జట్లు తలపడుతున్నాయి. భారత్ గ్రూప్ బీలో .. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ జట్లతో తలపడుతుంది. తన తొలి మ్యాచ్ భారత్ నవంబర్ 9న గయానా వేదికగా న్యూజిలాండ్‌తో ప్రారంభంకానుంది. నవంబర్ 11న పాకిస్తాన్, 15న ఐర్లాండ్, 17న ఆస్ట్రేలియాతో భారత్ పోటీపడనుంది.
భారత జట్టు : హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), మిథాలీ రాజ్, జెమీమా రోడ్రిగ్స్, వేదా కృష్ణమూర్తి, దీప్తి శర్మ, తాన్యా భాటియా (వికెట్ కీపర్), పూనమ్ యాదవ్, రాధా యాదవ్, అనుజ పాటిల్, ఏక్తా బిష్త్, డి.హేమలత, మాన్షి జోషి, పూజ వస్త్రాకర్, అరుంధతి రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment