విండీస్‌ స్పిన్నర్‌ మాయాజాలం.. 157 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్‌ | Pakistan Set 251 Runs Target To West Indies In First Test | Sakshi
Sakshi News home page

విండీస్‌ స్పిన్నర్‌ మాయాజాలం.. 157 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్‌

Published Sun, Jan 19 2025 12:24 PM | Last Updated on Sun, Jan 19 2025 12:59 PM

Pakistan Set 251 Runs Target To West Indies In First Test

పాకిస్తాన్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య ముల్తాన్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతుంది. మూడో రోజు ఆట ప్రారంభించిన పాకిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 157 పరుగులకే కుప్పకూలింది. విండీస్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ జోమెల్‌ వార్రికన్‌ ఏడు వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టాడు. మరో స్పిన్నర్‌ గుడకేశ్‌ మోటీ ఓ వికెట్‌ తీశాడు. 

పాక్‌ ఇన్నింగ్స్‌లో ఇద్దరు (షాన్‌ మసూద్‌, ఖుర్రమ్‌ షెహజాద్‌) రనౌట్‌ అయ్యారు. షాన్‌ మసూద్‌ 52, ముహమ్మద్‌ హురైరా 29, బాబర్‌ ఆజమ్‌ 5, కమ్రాన్‌ గులామ్‌ 27, సౌద్‌ షకీల్‌ 2, మహ్మద్‌ రిజ్వాన్‌ 2, సల్మాన్‌ అఘా 14, నౌమన్‌ అలీ 9, సాజిద్‌ ఖాన్‌ 5, ఖుర్రమ్‌ షెహజాద్‌ డకౌటయ్యారు.

తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని కలుపుకుని పాక్‌ విండీస్‌ ముందు 251 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో విండీస్‌ సైతం తడబడుతుంది. ఆ జట్టు 9 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విండీస్‌ గెలవాలంటే మరో 221 పరుగులు చేయాలి. చేతిలో ఎనిమిది వికెట్లు మాత్రమే ఉన్నాయి. కెప్టెన్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌(12), కీసీ కార్తీ (6) ఔట్‌ కాగా.. మికైల్‌ లూయిస్‌ (11), కవెమ్‌ హాడ్జ్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు. సాజిద్‌ ఖాన్‌కు రెండు వికెట్లు దక్కాయి.

అంతకుముందు పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకు ఆలౌటైంది. సౌద్‌ షకీల్‌ (84), మహ్మద్‌ రిజ్వాన్‌ (71) అర్ద సెంచరీలు సాధించి పాక్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు. పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో షాన్‌ మసూద్‌ 11, ముహమ్మద్‌ హురైరా 6, బాబర్‌ ఆజమ్‌ 8, కమ్రాన్‌ గులామ్‌ 5, సల్మాన్‌ అఘా 2, నౌమన్‌ అలీ 0, సాజిద్‌ ఖాన్‌ 18, ఖుర్రమ్‌ షెహజాద్‌ 7 పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్లలో వార్రికన్‌, జేడన్‌ సీల్స్‌ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. కెవిన్‌ సింక్లెయిర్‌ 2, మోటీ ఓ వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 137 పరుగులకే కుప్పకూలింది. పాక్‌ స్పిన్నర్లు నౌమన్‌ అలీ (11-2-39-5), సాజిద్‌ ఖాన్‌ (12-0-65-4), అబ్రార్‌ అహ్మద్‌ (1.2-1-6-1) విండీస్‌ నడ్డి విరిచారు. విండీస్‌ ఇన్నింగ్స్‌లో 10, 11వ నంబర్‌ ఆటగాళ్లు వార్రికన్‌ (31 నాటౌట్‌), జేడన్‌ సీల్స్‌ (22) మాత్రమే 20కి పైగా పరుగులు చేశారు. వీరిద్దరు చివరి వికెట్‌కు 46 పరుగులు జోడించి విండీస్‌ పరువు కాపాడారు. లేకపోతే విండీస్‌ 100లోపే ఆలౌటయ్యేది. 

విండీస్‌ ఇన్నింగ్స్‌లో వీరితో పాటు బ్రాత్‌వైట్‌ (11), కెవిన్‌ సింక్లెయిర్‌ (11), మోటీ (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మికైల్‌ లూయిస్‌ 1, కీసీ కార్తీ 0, కవెమ్‌ హాడ్జ్‌ 4, అలిక్‌ అథనాజ్‌ 6, జస్టిన్‌ గ్రీవ్స్‌ 4, టెవిన్‌ ఇమ్లాచ్‌ 6 పరుగులు చేశారు. 
    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement