T 20 world cup
-
‘ఆనాటి సిగ్గరే..నేటి లెజెండ్!’ బుమ్రాపై పొరుగింటి ఆంటీ భావోద్వేగ పోస్ట్ వైరల్
ఉత్కంఠభరితంగా బార్బడోస్‌లో జరిగిన మ్యాచ్‌లో టీ-20 ప్రపంచ కప్‌ను టీమిండియా దక్కించుకుంది. దీంతో టీమిండియా ఆటగాళ్లపై అభినందనలు వెల్లువెత్తాయి. ప్రధానంగా సూర్యకుమార్‌యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ హీరోలుగా నిలిచారు. అయితే జస్ప్రీత్ బుమ్రా తల్లి సన్నిహితురాలు, పొలిటికల్ జర్నలిస్టు చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఒకటి వైరల్‌గా మారింది.ప్రపంచ కప్ ఫైనల్లో జస్ప్రీత్ బుమ్రా తన అద్భుతమైన ప్రదర్శనకు స్టార్ క్రికెటర్‌పై నా హీరో అంటూ తన ప్రేమను అభిమానాన్ని చాటుకున్నారు బుమ్రా తల్లి దల్జీత్కి బెస్ట్ ఫ్రెండ్ దీపాల్ త్రివేది. ‘‘ నాకున్న క్రికెట్ పరిజ్ఞానం శూన్యం.. విరాట్ కోహ్లీ అనుహ్క భర్తగా తెలుసు. అతని డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించినప్పుడు నాకు నచ్చుతుంది. ఒకప్పుడు సిగ్గరి.. ఇప్పుడు లెజెండ్' అంటూ బుమ్రాపై సుదీర్ఘ భావోద్వేగ పోస్ట్ పెట్టారు దీపాల్ త్రివేది. ఇందులో బుమ్రాతో తనకున్న అనుబంధాన్ని, అతడి పడ్డ కష్టాలను వివరంగా రాసుకొచ్చారు. అంతేకాదు బుమ్రా పుట్టినపుడు తొలుత చేతుల్లోకి తీసుకున్నఅదృష్టవంతురాల్ని తానే అంటూ సంతోషాన్ని ప్రకటించారు. అప్పుడే పుట్టిన బిడ్డను తాకడం అదే మొదటిసారి. అప్పటికే కుమార్తె ఉన్నప్పటికీ అది పెద్దగా గుర్తులేదు. బిడ్డ సన్నగా, బలహీనంగా ఉన్నాడు .. ఆ క్షణాలు ఇప్పటికీ గుర్తు అన్నారామె.My cricket knowledge is Zero. I know Virat Kohli as Anushka's husband. He is so pleasant and I like when he tries to dance. But this (long) post is about my hero. One day in December 1993, when my salary was less than Rs 800 a month, my best friend and next door neighbour… pic.twitter.com/uvWQmmAwwN— Deepal.Trivedi #Vo! (@DeepalTrevedie) June 30, 2024అలాగే చిన్నప్పటినుంచీ బుమ్రా పట్టుదల, సంకల్పం గురించి వివరించారు. నిజంగా మా స్టోరీ బాలీవుడ్ సినిమా కంటే తక్కువేమీకాదు. బుమ్రా తండ్రి జస్బీర్ సింగ్ మరణించిన తరువాత తల్లి రోజుకు కనీసం 16-18 గంటలు పనిచేస్తూ చాలా కష్టపడేది. పొరుగువారిగా, కష్టాలు, నష్టాలు అన్నీ పంచుకున్నాం. ఒక చిన్న ప్లాస్టిక్బాల్తో బుమ్రా ఎపుడూ క్రికెట్ ఆడుతూ ఉండేవాడనీ, తనకు మాత్రం దల్జీత్ ఇల్లు స్వర్గధామం లాంటిదని తెలిపారు. ఒకసారి తన ఇంక్రిమెంట్ డబ్బులతో బుమ్రాకు విండ్చీటర్ (జాకెట్) కొనిచ్చిన ఏకైక బహుమతిని కూడా దీపాల్ గుర్తు చేసుకున్నారు. జస్ప్రీత్ బుమ్రాకు గర్వమనేదే లేదు. వినయం ఏమాత్రం తగ్గలేదు. అతడ్ని చూసి ప్రతీ భారతీయుడు గర్వపడాలి. అతని నుండి నేర్చుకోవాలంటూ బుమ్రాపై ప్రశంసలు కురిపించారు. -
T20 వరల్డ్ కప్ టీమ్ లో ఆ ముగ్గురు వేస్ట్
-
ఐపీఎల్లో పది సెకన్ల యాడ్‌కి ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా?
కరోనా సంక్షోభంతో ఆదాయం పడిపోయిన టెలివిజన్ రంగానికి ఆటలు ఊపిరి పోస్తున్నాయి. ఒకప్పుడు టీవీ యాడ్ రెవెన్యూలో పది శాతంగా ఉన్న స్పోర్ట్స్ వాటా ఇటీవల 20 శాతానికి చేరుకుంది. ముఖ్యంగా టీమిండియాలో క్రికెట్లో విజయాలు సాధిస్తుంటే దానికి తగ్గట్టుగా టీవీల యాడ్ రెవిన్యూ బౌండరీలు దాటేస్తోంది. ఆదుకున్న ఆస్ట్రేలియా పర్యటన కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో ఒక్కసారిగా దేశ ఆర్థిక వ్యవస్థ మందగించింది. వ్యాపారాలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో దాని ప్రభావం అడ్వెర్‌టైజ్ రంగంపై పడింది. దీంతో యాడ్ రెవెన్యూ ఆధారంగా నడిచే టెలివిజన్ రంగానికి పెద్ద చిక్కే వచ్చి పడింది. అయితే ఆస్ట్రేలియా టూర్లో టీమిండియా సంచలనం సాధించడం.. ఆ వెంటనే ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాకవడంతో ఒక్కసారిగా యాడ్ రెవెన్యూ పట్టాలెక్కింది. మధ్యలో కరోనా కరోనా సెకండ్ వేవ్ ఇబ్బంది పెట్టినా టోక్యో ఒలింపిక్స్ ఆదుకున్నాయి. పెరిగిన స్పోర్ట్స్ వాటా టీవీ యాడ్ రెవెన్యూలో కరోనా ముందు వరకు స్పోర్ట్స్ వాటా 10 నుంచి 15 శాతం వరకే ఉండేది. అయితే ఫస్ట్ వేవ్ ముగిసిన తర్వాత ఐపీఎల్ ప్రారంభంతో ఒక్కసారిగా యాడ్ రెవెన్యూ వాటా 20 శాతానికి పెరిగిందని ఇంటిగ్రేటెడ్ మీడియా ఆఫ్ అడ్వెర్టైజింగ్ కంపెనీ డీడీబీ గ్రూప్ ఎండీ రామ్ మోహన్ సుందరమ్ తెలిపారు. కరోనాకి ముందు టీవీ యాడ్ రెవెన్యూ రూ. 28,000 కోట్లు ఉండగా ఇందులో క్రీడల వాటా రూ. 2,500 కోట్లుగా ఉండేంది. ఐపీఎల్ తర్వాత ఇది ఏకంగా రూ. 4500 కోట్ల నుంచి రూ. 5,000 కోట్ల వరకు చేరుకుందని ఆయన వెల్లడించారు. అగ్రస్థానం క్రికెట్‌దే టీవీలకు ఆదాయం సంపాదించి పెడుతున్న ఆటల్లో క్రికెట్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్ ద్వారా రూ.300ల నుంచి రూ. 400 కోట్ల ఆదాయం వచ్చింది. త్వరలో జరగబోయే టీ 20 వరల్డ్ కప్ ద్వారానే రూ.1,200 కోట్ల రెవెన్యూ వస్తుందని యాడ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. ఇక ఐపీఎల్ 14 సీజన్ యాడ్ రెవిన్యూ విలువ అయితే ఏకంగా రూ. 2,500 కోట్లుగా ఉంది. క్షణానికి లక్ష ప్రపంచకప్, టోక్యో ఒలింపిక్స్‌లను మించిన డిమాండ్ బుల్లితెరపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్‌కి ఉంది. ఇటీవల మధ్యలో ఆగిపోయిన సీజన్ 14కి సంబంధించి కేవలం పది సెకన్ల యాడ్‌కి రూ. 14 లక్షల వంతున ఛార్జ్ చేశాయి టీవీలు. అంటే ఒక్క సెకనుకి లక్షకు పైగానే ధర పలుకుతోంది. అయినా సరే కార్పొరేట్ కంపెనీలు వెనక్కి తగ్గడం లేదు. టీవీలు అడిగినంత సొమ్ము చెల్లించి స్లాట్ బుక్ చేసుకుంటున్నాయి. సినిమాను దాటేసింది ఇండియన్ టెలివిజన్ యాడ్ రెవిన్యూలో ఇప్పటికీ అగ్రస్థానం సీరియల్లే ఆక్రమించాయి. ఆ తర్వాత సినిమాలు, న్యూస్, స్పోర్ట్స్, మ్యూజిక్, కిడ్స్ విభాగాలు ఉండేవి. క్రమంగా సినిమాలను స్పోర్ట్స్ వెనక్కి నెట్టేస్తోంది. పిచ్ మాడిసన్ 2019 రిపోర్టు ప్రకారం యాడ్ రెవెన్యూలో న్యూస్ వాటా 11 శాతం ఉండగా స్పోర్ట్స్ వాటా 10 శాతానికి చేరుకుంది. సినిమాలు 8 శాతానికే పరిమితం అయ్యాయి. మ్యూజిక్, కిడ్స్ 3 శాతం వాటాను కలిగి ఉన్నాయి. చదవండి : Jeff Bezos: ఆసక్తికర ప్రయోగానికి సిద్ధమైన జెఫ్ బెజోస్..! -
టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది
-
టీ-20 వరల్డ్ కప్: భారత్-పాక్ పోరుకు తేది ఖరారు
న్యూఢిల్లీ: భారత్ పాక్ మధ్య మ్యాచ్ అంటే ఆ మాజాయే వేరు. ఈ ఏడాది జరగనున్న టీ-20 ప్రపంచ కప్ ద్వారా క్రికెట్ ప్రేమికులు దాన్ని ఆస్వాదించనున్నారు. ప్రపంచకప్ కోసం ఐసీసీ విడుదల చేసిన జాబితాలో పాకిస్తాన్, భారత్ గ్రూప్-2 నుంచి పొట్టి ప్రపంచ కప్ సమరానికి పోటీలో పాల్గొంటున్నాయి. చిరకాల ప్రత్యర్థులైన రెండు జట్లు ఈ ఏడాది దుబాయ్ వేదికగా అక్టోబర్ 24న జరగనున్న మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇక అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు టీ-20 ప్రపంచకప్ జరుగుతుందన్న సంగతి తెలిసిందే. -
టీ ట్వంటీ ప్రపంచకప్ గ్రూప్స్ ప్రకటించిన ఐసీసీ
-
డీకే తిట్టుకున్న బ్యాట్‌తో రోహిత్ దంచి కొట్టాడు..
ముంబై: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. అంతర్జాతీయ కెరీర్లో మొట్టమొదటి అర్ధ శతకాన్ని తనకు కలిసిరాని బ్యాట్‌తో సాధించాడని టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్ వెల్లడించాడు. మంగళవారం(జూన్ 1న) 36వ జన్మదినాన్ని జరుపుకున్న డీకే.. ఈ ఆసక్తికర విషయాన్ని ప్రస్తావించాడు. దక్షిణాఫ్రికా గడ్డపై 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సఫారీలతో జరిగిన మ్యాచ్‌లో తాను తిట్టుకుని, వద్దనుకున్న బ్యాట్‌తో రోహిత్ అద్భుతంగా రాణించాడని, 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 50 పరుగులతో అజేయంగా నిలిచాడని గుర్తు చేసుకున్నాడు. రోహిత్ శర్మ తొలి అర్థసెంచరీ తన బ్యాట్ నుంచి జాలువారడాన్ని తలచుకుంటే ఇప్పటికీ గర్వంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించాడు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేయగా.. ఛేదనలో దక్షిణాఫ్రికా 116/9కే పరిమితమైంది. 50 పరుగలతో నాటౌట్‌గా నిలిచిన రోహిత్ శర్మకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, అదే మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన దినేశ్ కార్తీక్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. పొలాక్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే మోర్కెల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్రమంలో డ్రెస్సింగ్ రూముకి వచ్చిన డీకే.. తనకు ఆ బ్యాట్ కలిసి రావడం లేదని తిట్టుకున్నాడట. ఆ సమయంలో పక్కనే ఉన్న రోహిత్.. డీకేను ఆ బ్యాట్ ఇవ్వల్సిందిగా కోరి, అదే బ్యాట్‌తో హాఫ్ సెంచరీ బాదినట్లు డీకే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం డీకే ఐపీఎల్‌కు మాత్రమే పరిమితం కాగా, రోహిత్ టీమిండియాలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. చదవండి: తొలి టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌కు గట్టి షాక్.. -
‘ఆ ఓటమికి చివరి శ్వాస వరకు బాధపడతాను’
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ ఓపెనర్ ఇమ్రాన్ నజీర్ 2007 టీ 20 ప్రపంచ కప్ ఫైనల్‌పై ఉద్వేగంగా స్పందించాడు. భారత్ పాక్ మధ్య ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా సంచలన విజయంతో టీ 20 ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యచ్‌లో భారత్ 158 పరుగుల లక్ష్యాన్ని పాక్‌కు నిర్దేశించింది. అయితే ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో చివరి బంతికి మిస్బావుల్ హక్‌ను జోగేందర్ శర్మా అవుట్ చేయడంతో టీ 20 ప్రపంచకప్ భారత్ సొంతమైంది. కాగా భారత్ చేతిలో పాక్ ఓటమిని జీర్ణించుకోలేనని, చివరి శ్వాస వరకు తనకు బాధ కలిగిస్తుందని తెలిపారు. ఓ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ ఇమ్రాన్ నజీర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. సులువుగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకున్నందుకు తీవ్ర మనోవేధనకు గురయినట్లు తెలిపారు. అయితే ఫైనల్ మ్యాచ్‌లో నజీర్ ఓపెనర్‌గా దూకుడైన ఆటతో అదరగొట్టాడు. కేవలం 5.3 ఓవర్లలోనే 53పరుగులు సాధించి పాక్ మెరుగైన రన్‌రేటును సాధించింది. కేవలం 14బంతుల్లోనే వాయువేగంతో 33 పరుగులను నజీర్ సాధించాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న తాను రనౌట్ కావడం తీవ్ర నిరాశ కలిగించిందని నజీర్ ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు తీవ్ర అనారోగ్యంతో కొన్ని సంవత్సరాలు క్రికెట్‌కు దూరంగా ఉన్న నజీర్ తన చివర టీ 20 మ్యాచ్ శ్రీలంతో 2012లో ఆడాగా, పాక్ తరుపున 9టెస్ట్‌లు, 79వన్డేలు, 25టీ 20 మ్యాచ్‌లను ఇమ్రాన్ నజీర్ ఆడాడు. -
'చంపేయాలన్నంత కోపం వచ్చింది'
తిరువనంతపురం : టీమిండియా స్పీడస్టర్ శ్రీశాంత్ ఆట కంటే వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా 2003 ప్రపంచకప్ ఫైనల్లో భారత ఓటమిని జీర్ణించుకోలేక ఆసీస్ క్రికెటర్లను చంపేయాలన్నంత కసిని పెంచుకున్నట్లు ఒక టీవీషోకు ఇచ్చిన ఇంటర్య్వూలో శ్రీశాంత్ పేర్కొన్నాడు. కాగా 2003 ప్రపంచకప్‌లో టోర్నీ ఆద్యంతం అదరగొట్టిన టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో రెండు సార్లు ఓటమిపాలైంది. లీగ్ స్టేజ్‌లో 125 పరుగులకే ఆలౌట్ అయిన గంగూలీ సేన 8 వికెట్లతో పరాజయం చవిచూసింది. ఇక టైటిల్ ఫైట్‌లో 359 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక అంతే పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ రెండు పరాజయాలు తన మనసులో నాటుకుపోయాయని, అవకాశం దొరికితే వారిని చంపేయాలనంత కసిని పెంచుకున్నానంటూ శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. (కేకేఆర్ ట్వీట్‌పై మనోజ్ ఆగ్రహం) '2003 ప్రపంచకప్‌లో వారు భారత్‌ను ఓడించిన విధంగా చిత్తు చేయాలనుకున్నాను. ఆ ఓటమి ఎప్పటికీ నా మనస్సులో ఉంటుంది. వారిని చంపేయాలనంత కసిని పెంచింది. అప్పటి నుంచి ఆస్ట్రేలియా ఆటగాళ్లతో నేనెప్పుడూ చాలా కోపంగా ఉండేవాడిని. ఆ అవకాశం నాకు మళ్లీ 2007 టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో వచ్చింది. యార్కర్ వేయాలని భావించిన నా తొలి బంతిని మాథ్యూ హెడెన్ ఫోర్ కొట్టడం నాకింకా గుర్తుంది. ఆ మ్యాచ్‌ను మీరు చూసినట్లయితే.. నేను చాలా ప్యాషన్‌తో పరుగు తీయడం కనిపిస్తుంది. ఎలాగైనా ఆస్ట్రేలియాను ఓడించాలనుకున్నాను. ప్రతీ ఒక్కరు మాట్లాడుకునే మ్యాచ్‌లో నన్ను భాగస్వామ్యం చేసిన ఆ దేవుడికి నేనెప్పుడు కృతజ్ఞుడిగా ఉంటా. నా దేశం తరపున నేను కనబర్చిన అత్యుత్తమ ప్రదర్శన అదే. ఆ మ్యాచ్‌లో నేను చాలా డాట్ బాల్స్ వేసాను. కేవలం రెండే ఫోర్లు ఇచ్చి12 పరుగులు మాత్రమే సమర్పించుకొని రెండు వికెట్లు కూడా తీశా. ఈ ఏడాది సెప్టెంబర్‌తో తనపై బీసీసీఐ విధించిన ఏడేళ్ల నిషేధం తొలిగిపోనుండటంతో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నా' అంటూ చెప్పుకొచ్చాడు. (మూడో ఫైనల్.. రెండో ట్రోఫీ.. అదిరిందయ్యా ధోని) ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన విషయం తెలిసిందే. రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలపై శ్రీశాంత్‌పై బోర్డు చర్యలు తీసుకుంది. అయితే దీనిపై కోర్టులకెళ్లి సుదీర్ఘ పోరాటం చేసిన ఈ కేరళ పేసర్.. పలుమార్లు తనకు అనుకూలంగా తీర్పులు తెచ్చుకున్నా బీసీసీఐ మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కానీ గతేడాది శ్రీశాంత్‌పై విధించిన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్‌మన్ డీకే జైన్ ఆదేశాలిచ్చారు. దాంతో అతనిపై ఏడేళ్ల నిషేధ కాలం ఈ సెప్టెంబర్‌తో పూర్తి కానుంది. భారత్ గెలిచిన 2007 టీ20 ప్రపంచకప్, 2011 వరల్డ్‌కప్ టీమ్‌లలో శ్రీశాంత్ సభ్యుడిగా కొనసాగిన విషయం విధితమే. ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో జోగి వేసిన ఆఖరి బంతిని క్యాచ్‌గా పట్టుకొని భారత్ విశ్వవిజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. -
'సిక్స్ కొడితే ఆ బంతిని బ్యాట్స్‌మన్ తెచ్చుకోవాలి'
ముంబై : కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో క్రీడలన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమవడంతో వారంతా ఫామ్‌ను అందుకునేందుకు చాలా సమయం పడుతుందని టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ అంటున్నాడు. అందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను ఏదైనా సిరీస్ లేక టోర్నమెంట్ ముందు నిర్వహిస్తే ఆటగాళ్లు మునుపటి ఫామ్‌ను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో చహల్ మాట్లాడుతూ..' కరోనా ప్రభావం తగ్గి మైదానంలోకి దిగితే ఆటగాళ్లు ఫామ్‌ను అందుకోవడానికి సమయం తీసుకుంటారు. నా దృష్టిలో మిగతా సిరీస్‌లను నిలిపివేసి ఐపీఎల్‌ను నిర్వహిస్తే బాగుంటుంది. ఐపీఎల్‌ను నిర్వహించాలనుకుంటే మాత్రం రెండు నెలలు నిర్వహిస్తే ఆటగాళ్లకు మంచి ప్రాక్టీస్ దొరుకుతుంది. దీంతో రాబోయే సిరీస్‌లకు ఇది మంచి అవకాశంగా మారుతుందంటూ' పేర్కొన్నాడు.(నాకు సచిన్ వార్నింగ్ ఇచ్చాడు..: గంగూలీ) బంతిని షైన్ చేసేందుకు సలైవాను ఉపయోగిస్తున్నారని, దీనివల్ల బౌలర్లకు మేలు జరగుతుందనే అభిప్రాయం ఉంది. దీనిపై నువ్వేమంటావు అని చాహల్‌ను ప్రశ్నించగా.. ' బంతిని పాతబడే కొద్ది దానిని షైన్ చేయకపోతే మాకు స్వింగ్ చేసే అవకాశం ఉండదు. అప్పుడు వికెట్లు రావడం కూడా కష్టమవుతుంది. ఇక బ్యాట్స్‌మెన్ ఎప్పుడైనా సిక్స్ కొడితే ఆ బంతిని తిరిగి తెచ్చుకోవాలనే కొత్త రూల్‌ను క్రికెట్లో యాడ్ చేయాల్సి వస్తుంది.. ఎందుకంటే అది బ్యాట్స్‌మెన్‌కు ప్రతీ బంతిని సిక్స్ కొట్టే అవకాశం ఇస్తుందని' నవ్వుతూ తెలిపాడు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఐసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించినా ప్రపంచకప్ నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతేగాక పరిస్థితులు ఇలాగే ఉంటే టీ 20 ప్రపంచకప్ 2021 ఫిబ్రవరి- మార్చిలో జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఐసీసీ ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. అక్టోబర్ వరకు కూడా కరోనా ప్రభావం తగ్గకపోతే ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచ్‌లను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఇలా నిర్వహించడానికి ఐసీసీ సిద్ధంగా లేనట్లు తెలుస్తుంది. (పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై నిషేధం) -
సరైన సమయంలో చెబుతాం
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చే పొట్టి ప్రపంచకప్‌పై తొందరపడాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వ్యాఖ్యానించింది. కోవిడ్–19 రోజురోజుకీ ప్రపంచవ్యాప్తంగా తీవ్రరూపం దాలుస్తోంది. దీంతో అన్ని దేశాల్లోనూ లాక్డౌన్ పొడిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్‌లో జరగాల్సిన ఈవెంట్‌పై ఇప్పుడే నిర్ణయానికి రాలేమని... దీనికి చాలా సమయముందని, కాబట్టి అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. ‘ఐసీసీ ఈవెంట్ల కోసం మా ప్రణాళికతో మేం ముందుకెళ్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో మేం కూడా బాధ్యతాయుతంగా, వివేకవంతంగా ఆలోచించాల్సిన అవసరముంది. అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాల్ని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటాం’ అని ఐసీసీ ప్రతినిధి తెలిపారు. -
'ధోని ఉంటాడో లేదో ఐపీఎల్‌తో తేలిపోనుంది'
న్యూఢిల్లీ : మహేంద్రసింగ్ ధోని జాతీయ జట్టుతో కొనసాగుతాడా లేదా అనేది 2020లో జరిగే ఐపీఎల్‌తో తేలనుందని టీమిండియా మాజీ కెప్టెన్, లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు. దీంతో పాటు వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ధోని సేవలు అవసరం అనిపిస్తే టీమిండియా జట్టులో తప్పక ఉంటాడని, అయితే ముందు జరగనున్న ఐపీఎల్లో అతని ప్రదర్శన ఎలా ఉంటుదనే దానిపైనే ఆధారపడి ఉంటుందని కుంబ్లే అభిప్రాయపడ్డాడు.అయితే దీనికి కొంత సమయం ఉండడంతో అంతవరకు మనం వేచి చూడాల్సిందేనని తెలిపాడు. కాగా వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్ల కంటే వికెట్లు తీయగలిగే బౌలర్లపైనే దృష్టి పెట్టాలని దిగ్గజ బౌలర్ సలహా ఇచ్చాడు. ' వచ్చే టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో జరగనుంది. నా దృష్టిలో కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ జట్టులో ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే అప్పటికి ఆప్ట్రేలియాలో ఉండే మంచు ప్రభావ పరిస్థితుల వల్ల ఈ మణికట్టు బౌలర్లు వికెట్లతో అదరగొడతారని ఆశిస్తున్నా. దీంతో పాటు ఆల్‌రౌండర్ల కంటే వికెట్లను ఎక్కువగా తీసే ఫాస్ట్ బౌలర్లను జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది. ఆస్ట్రేలియాలోని పిచ్ పరిస్థితిని బట్టి జట్టును ఎంపిక చేసుకోవాలని' కుంబ్లే తెలిపాడు. కాగా వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు ఆస్ట్రేలియాలో జరగనుంది. (చదవండి : ధోనిని కాదని.. రోహిత్‌కే ఓటు) -
టీ20 ప్రపంచకప్ : మన హైదరాబాద్ అమ్మాయికి చోటు
సాక్షి, న్యూఢిల్లీ : ఐసీసీ మహిళల వరల్డ్ టీ-20 ప్రపంచ కప్ కోసం ఆల్ ఇండియా విమెన్స్ సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. జట్టులో మరో హైదరబాద్ అమ్మాయి అరుందతీ రెడ్డికి అవకాశం దక్కింది. ఇటీవల శ్రీలంక తో జరిగిన టీ20 సిరీస్‌లో అరుందతీ రెడ్డి రాణించిన విషయం తెలిసిందే. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో 15 మందితో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. హర్డ్ హిట్టర్ స్మృతి మంధాన జట్టుకి వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. నవంబర్ 9 నుంచి 24 వరకు ఈ టోర్నీ వెస్టిండీస్ వేదికగా జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం పది జట్లు తలపడుతున్నాయి. భారత్ గ్రూప్ బీలో .. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ జట్లతో తలపడుతుంది. తన తొలి మ్యాచ్ భారత్ నవంబర్ 9న గయానా వేదికగా న్యూజిలాండ్‌తో ప్రారంభంకానుంది. నవంబర్ 11న పాకిస్తాన్, 15న ఐర్లాండ్, 17న ఆస్ట్రేలియాతో భారత్ పోటీపడనుంది. భారత జట్టు : హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), మిథాలీ రాజ్, జెమీమా రోడ్రిగ్స్, వేదా కృష్ణమూర్తి, దీప్తి శర్మ, తాన్యా భాటియా (వికెట్ కీపర్), పూనమ్ యాదవ్, రాధా యాదవ్, అనుజ పాటిల్, ఏక్తా బిష్త్, డి.హేమలత, మాన్షి జోషి, పూజ వస్త్రాకర్, అరుంధతి రెడ్డి -
టి20 కూడా ఇంగ్లండ్‌దే
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్ పర్యటనలో ఆస్ట్రేలియా పరాజయం పరిపూర్ణమైంది. కంగారూలు ఏకైక టి20లో కూడా పరాజయంపాలై వెనుదిరిగారు. బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు సాధించింది. జోస్ బట్లర్ (30 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) మరోసారి చెలరేగాడు. ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (22 బంతుల్లో) చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. జేసన్ రాయ్ (44; 6 ఫోర్లు), హేల్స్ (49; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం ఆసీస్ 19.4 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఆరోన్ ఫించ్ (41 బంతుల్లో 84; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగినా, మిగతావారంతా విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. -
ఇండియా పాక్ మ్యాచ్‌కు ఎర్త్ అవర్ ఎఫెక్ట్
న్యూఢిల్లీ: సమతుల్య వాతావరణం కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా అవసరం లేని లైట్లను స్విచ్ ఆఫ్ చేసి ఎర్త్ అవర్ పాటించనున్న విషయం తెలిసిందే. అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఈ పరిస్థితి ఎలా ఉన్నా భారత్, పాకిస్థాన్‌లో భిన్నంగా ఉండనుంది. ఎందుకంటే ఇండియా పాకిస్థాన్‌ల మధ్య శనివారం సాయంత్రం 7.30గంటల ప్రాంతంలో టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎర్త్ అవర్ గంటపాటు అంటే 8.30 నుంచి 9.30 వరకు పాటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దీని ప్రభావం ఈ మ్యాచ్ కోసం చూస్తున్న వారిపై పడే అవకాశం ఉంది. ఆ సమయంలో చాలామంది ఇళ్లలో ఎన్ని టీవీలు ఉంటే అన్ని టీవీలు కచ్చితంగా ఆన్ చేసే ఉంటాయి. ఒక వేళ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని గౌరవిస్తూ ఎర్త్ అవర్ పాటించాల్సి వస్తే చాలామంది తమ ఇళ్లలో టీవీలు కట్టేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సోలార్ పవర్ ఉపయోగించేవారి ఇళ్లలో ఉండే టీవీలను షేర్ చేసుకుంటూ మ్యాచ్ చూడాల్సిందిగా ఇప్పటికే అధికారులు విజ్ఞప్తి చేశారు. పారిస్ ప్రొటోకాల్ ప్రకారం ఉష్ణోగ్రతల పెరుగుదల రెండు శాతానికి మించకుండా ప్రతీ దేశంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఎర్త్ అవర్ నిర్వహిస్తున్నారు. 2007 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎర్త్ అవర్‌ను ప్రతీ ఏడాది పాటిస్తున్నారు. -
పాక్ విజయ లక్ష్యం 97
ఢిల్లీ: టీ 20 మహిళల ప్రపంచకప్ క్రికెట్లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత క్రీడాకారిణిలను పాక్ బౌలర్లు సమర్థవంతంగా కట్టడి చేశారు. భారత జట్టులో కృష్ణమూర్తి చేసిన 24 పరుగులే టాప్ స్కోర్. తొలుత భారత ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగింది. భారత స్కోరు బోర్డు 10 పరుగులకు చేరుకోవడానికి 7 ఓవర్లు పూర్తయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కెప్టెన్ మిథాలీ రాజ్(35 బంతుల్లో 16 పరుగులు), కౌర్ (29 బంతుల్లో 16)లను పాక్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కట్టడిచేశారు. 97 పరుగుల విజయ లక్ష్యంతో పాక్ జట్టు బ్యాటింగ్ కొనసాగిస్తోంది. -
ఊదేశారు!
తొలి టి20లో భారత్ గెలుపు రాణించిన ఉతప్ప, విజయ్ స్పిన్ ఉచ్చుకు జింబాబ్వే విలవిల మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అక్షర్ 5 ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఐదుగురు పాండే, జాదవ్, అక్షర్ పటేల్, బిన్నీ, సందీప్‌లు టి20ల్లో అరంగేట్రం చేశారు. టి20 ప్రపంచకప్ ఆడిన అనుభవం ఉన్న ఉతప్ప, హర్భజన్ మినహా ప్రస్తుత భారత జట్టులోని మిగతా ఆటగాళ్లందరూ ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చినవారే. లీగ్‌లో ఆడిన అనుభవాన్ని తమలోని నైపుణ్యానికి జోడించి విదేశీ గడ్డపై జింబాబ్వేను ఉఫ్‌మని ఊదేశారు. సీనియర్లు లేరన్న లోటును మరిపిస్తూ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టారు. దీంతో తొలి టి20లో టీమిండియా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. హరారే: వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి జోరుమీదున్న భారత్.. టి20లోనూ సత్తా చాటింది. బ్యాటింగ్‌లో రాబిన్ ఉతప్ప (35 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు), మురళీ విజయ్ (19 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) మెరిస్తే.. బౌలింగ్‌లో అక్షర్ పటేల్ (3/17), హర్భజన్ (2/29)లు తమ మాయాజాలాన్ని చూపించారు. ఫలితంగా శుక్రవారం జరిగిన టి20 మ్యాచ్‌లో భారత్ 54 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు చేసింది. తర్వాత జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 124 పరుగులే చేసి ఓడింది. మసకద్జా (24 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. చిబాబా (27 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. అక్షర్ పటేల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆదివారం రెండో టి20 మ్యాచ్ జరుగుతుంది. ఓపెనర్ల శుభారంభం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం, ఆతిథ్య పేసర్ల నుంచి పెద్దగా ఇబ్బంది లేకపోవడంతో భారత ఓపెనర్లు రహానే (32 బంతుల్లో 33; 2 ఫోర్లు), విజయ్‌లు ఆరంభంలో చెలరేగి ఆడారు. బౌండరీల జోరుతో స్కోరును వేగంగా ముందుకు తీసుకెళ్లారు. ఏడు ఓవర్లలోనే ఈ జోడి తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించింది. అయితే ఇదే ఓవర్లో రజా మిడ్‌వికెట్ నుంచి వేసిన డెరైక్ట్ త్రోకు విజయ్ అనూహ్యంగా రనౌటయ్యాడు. తర్వాత రిస్క్ తీసుకోకుండా ఉతప్పతో కలిసి సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రయిక్‌ను రొటేట్ చేసిన కెప్టెన్ రహానే 10వ ఓవర్లో క్రెమెర్ బంతికి పెవిలియన్‌కు చేరాడు. దీంతో భారత్ 82 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. ఇక ఇక్కడి నుంచి జింబాబ్వే స్లో బౌలర్లు టీమిండియా పరుగుల వేగానికి కళ్లెం వేశారు. మనీష్ పాండే (19 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్) భారీ సిక్సర్‌తో రెచ్చిపోయినా... 5 ఓవర్లలో (10 నుంచి 14) కేవలం 31 పరుగులు మాత్రమే ఇచ్చారు. 16వ ఓవర్లో మనీష్ అవుట్‌కావడం భారత్ భారీ స్కోరుపై ప్రభావం చూపింది. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 45 పరుగులు జోడించారు. చివర్లో కేదార్ జాదవ్ (9), స్టువర్ట్ బిన్నీ (6 బంతుల్లో 11; 1 సిక్స్) వరుస విరామాల్లో వెనుదిరిగారు. ఆఖరి బంతికి హర్భజన్ (8 నాటౌట్) ఫోర్ కొట్టి భారత ఇన్నింగ్స్‌కు మంచి ముగింపు ఇచ్చాడు. మెంపోయు 3 వికెట్లు తీశాడు. స్పిన్నర్ల జోరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వేను స్పిన్నర్లు హర్భజన్, అక్షర్ పటేల్ ఘోరంగా దెబ్బతీశారు. ఆరంభంలో ఓపెనర్లు మసకద్జా, చిబాబా మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. సందీప్, భజ్జీ బౌలింగ్‌లో ఈ జోడి సిక్సర్లు బాదడంతో తొలి వికెట్‌కు 55 పరుగులు సమకూరాయి. కానీ పదో ఓవర్ నుంచి స్పిన్నర్లు తమ మాయాజాలాన్ని చూపెట్టారు. 10 బంతుల వ్యవధిలో మసకద్జా, చిగుంబురా (1), కోవెంట్రీ (10)లను అవుట్ చేశారు. మరో 17 బంతుల తేడాలో ఇర్విన్ (2) కూడా వెనుదిరగడంతో జింబాబ్వే 14 ఓవర్లలో 82 పరుగులకు సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. తర్వాత సికిందర్ రజా (10), క్రెమెర్ (9)లు నిలకడగా ఆడే ప్రయత్నం చేసినా భారత బౌలర్లు అవకాశం ఇవ్వలేదు. కనీసం సింగిల్స్ కూడా రాకపోవడంతో భారీ షాట్లకు ప్రయత్నించి ఈ ఇద్దరు స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. చివర్లో ఉత్సేయా (13 నాటౌట్), మజ్దీవా (14 నాటౌట్)... భువీ, సందీప్ ఓవర్లలో చెరో సిక్సర్, ఫోర్ కొట్టి భారత్ విజయాన్ని కాస్త ఆలస్యం చేశారు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రహనే (సి) మసకద్జా (బి) క్రెమెర్ 33; విజయ్ రనౌట్ 34; ఉతప్ప నాటౌట్ 39; పాండే (సి) రజా (బి) మెంపోయు 19; జాదవ్ (సి) మసకద్జా (బి) మెంపోయు 9; బిన్నీ (సి) క్రెమెర్ (బి) మెంపోయు 11; హర్భజన్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు: 25; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1-64; 2-82; 3-127; 4-150; 5-166. బౌలింగ్: ఉత్సేయా 4-0-30-0; మెంపోయు 4-0-33-3; ముజరబాని 3-0-36-0; మద్జీవా 4-0-46-0; క్రెమెర్ 4-1-20-1; రజా 1-0-2-0. జింబాబ్వే ఇన్నింగ్స్: మసకద్జా (సి) జాదవ్ (బి) అక్షర్ 28; చిబాబా (సి) మనీష్ (బి) హర్భజన్ 23; కోవెంట్రీ (సి) రహానే (బి) హర్భజన్ 10; చిగుంబురా (బి) అక్షర్ 1; సికిందర్ రజా (బి) అక్షర్ 10; ఇర్విన్ రనౌట్ 2; క్రెమెర్ (బి) మోహిత్ 9; ఉత్సేయా నాటౌట్ 13; మజ్దీవా నాటౌట్ 14; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 124. వికెట్ల పతనం: 1-55; 2-64; 3-66; 4-68; 5-82; 6-90; 7-98. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-22-0; సందీప్ 3-0-34-0; మోహిత్ 3-0-8-1; అక్షర్ పటేల్ 4-0-17-3; హర్భజన్ 4-0-29-2; స్టువర్ట్ బిన్నీ 2-0-8-0. -
టి20 ప్రపంచకప్ తర్వాత...
అంతర్జాతీయ క్రికెట్‌కు ఆఫ్రిది గుడ్‌బై కరాచీ : వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టి20 ప్రపంచ కప్ తర్వాత తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటానని పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది ప్రకటించాడు. ఈ టోర్నీలో కెప్టెన్‌గా పాక్ జట్టుకు టైటిల్ అందించాలనేదే తన లక్ష్యమని అతను పేర్కొన్నాడు. టెస్టుల నుంచి ఐదేళ్ల క్రితమే తప్పుకున్న ఆఫ్రిది, ఇటీవల ప్రపంచకప్‌తో వన్డేలకు కూడా వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఒక్క టి20 ఫార్మాట్లోనే ఆడుతున్న 35 ఏళ్ల ఆఫ్రిది తన కెరీర్లో 78 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లలో పాక్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 1154 పరుగులు చేసిన అతను, 81 వికెట్లు పడగొట్టాడు. -
నేడే టీ 20 వరల్డ్ కప్ ఫైనల్
-
అక్కడ వరుస ఓటములు... ఇక్కడ వరుస విజయాలు...
-
నేడు వెస్టిండీస్‌తో తలపడనున్న భారత్
-
న్యూజిలాండ్ బోణి
డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఇంగ్లండ్‌పై గెలుపు చిట్టగాంగ్: ఇటీవలి కాలంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న న్యూజిలాండ్ జట్టు టి20 ప్రపంచకప్‌లోనూ బోణి చేసింది. ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన గ్రూప్ ‘1’ లీగ్ మ్యాచ్‌లో కివీస్ తొమ్మిది పరుగుల తేడాతో నెగ్గింది. 173 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన కివీస్... 5.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 52 పరుగులతో ఉన్న దశలో వర్షం అంతరాయం కలిగించింది. ఆ తర్వాత ఆట సాధ్యం కాకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన ఫలితాన్ని ప్రకటించారు. బ్రెండన్ మెకల్లమ్ (6 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్; 2 సిక్స్‌లు), విలియమ్సన్ (17 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు)దూకుడుగా ఆడారు. అంతకుముందు ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 172 పరుగులు చేసింది. మొయిన్ అలీ (23 బంతుల్లో 36; 6 ఫోర్లు; 1 సిక్స్), మైకేల్ లంబ్ (24 బంతుల్లో 33; 4 ఫోర్లు; 1 సిక్స్)తో రాణించారు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు 72 పరుగులు జోడించారు. వరుస ఓవర్లలో వీరు అవుట్ కావడంతో ఇంగ్లండ్ జోరుకు బ్రేక్ పడింది. రెండు వికెట్లు తీసిన కివీస్ ఆల్‌రౌండర్ అండర్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది. -
టీ 20 వరల్డ్ కప్‌కు సిద్ధమైన టీమిండియా
-
ఫటాఫట్ క్రికెట్
-
‘మెరుపు’ లకు ముస్తాబు
బంగ్లా కోటలో ఇక అదిరే ఆట తొలిసారి టి20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం టెస్టు క్రికెట్ సంప్రదాయ భోజనం లాంటిది. కడుపు నిండుతుంది. టి20 క్రికెట్ చిరుతిండి (జంక్‌ఫుడ్) లాంటిది. ఇంకా తినాలనిపిస్తుంది. ఆరోగ్యకరం కాకపోయినా చిరుతిండిలోనే మజా. రోజంతా కూర్చుని క్రికెట్ చూడటం బోర్‌గా మారిన రోజుల్లో టి20లకు ఆదరణ పెరిగింది. అలాంటి టి20లో ప్రపంచ సమరం జరిగితే... ఎప్పుడెప్పుడా అని ఎదురు చూడాల్సిందే. ఇక ఆ సమయం వచ్చేసింది. బంగ్లాదేశ్‌లో టి20 ప్రపంచకప్‌కు రంగం సిద్ధమవుతోంది. మరో ఆరు రోజుల్లో పొట్టి ఫార్మాట్లో ధనాధన్ మెరుపులు చూడొచ్చు. 22 రోజుల పాటు కావలసినంత పరుగుల వినోదం. ఆసియా కప్‌ను సమర్థంగా నిర్వహించిన బంగ్లాదేశ్... ఇక ఓ మెగా టోర్నీనీ సూపర్ హిట్ చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. ప్రపంచంలోని ఎనిమిది అగ్రశ్రేణి జట్లతో పాటు పసికూనలుగా భావించే కొత్త జట్లు కూడా ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. 16 నుంచి మ్యాచ్‌లు ప్రారంభమవుతున్నా... ఇవి చిన్న జట్ల మధ్య అర్హత మ్యాచ్‌లు మాత్రమే. అసలు సిసలు హోరు 21 నుంచి మొదలవుతుంది. అది కూడా భారత్, పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్‌తో. టి20 ప్రపంచకప్‌కు సంబంధించిన అనేక విశేషాలతో ‘సాక్షి’ కౌంట్‌డౌన్ నేటి నుంచి... సాక్షి క్రీడావిభాగం తొలిసారి 2007లో మొదలైన టి20 ప్రపంచకప్ ఇప్పటికి నాలుగుసార్లు జరిగింది. టోర్నీలో అత్యధికంగా 12 జట్లు మాత్రమే ఆడాయి. ఈసారి మాత్రం ఆ సంఖ్యను ఐసీసీ 16కు పెంచింది. వన్డే ప్రపంచకప్‌లో జట్లను తగ్గించాలనే నిర్ణయం కారణంగా చిన్న దేశాలకు సమస్యలు రాకూడదని టి20 ప్రపంచకప్‌లో ఇక నుంచి 16 దేశాలను ఆడించాలని నిర్ణయించారు. అయితే దీనివల్ల టోర్నీ నాణ్యత దెబ్బతినకూడదు. దీంతో ప్రపంచకప్‌ను రెండు భాగాలుగా విభజించారు. ఎనిమిది అగ్రశ్రేణి జట్లు నేరుగా ప్రధాన మ్యాచ్‌లు ఆడేందుకు రెండు గ్రూపులుగా విడిపోయాయి. మిగిలిన 8 చిన్న దేశాలను కూడా రెండు గ్రూపులుగా చేసి అర్హత మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఇందులో గ్రూప్ స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లు వెళ్లి ఎనిమిది పెద్ద జట్లతో పాటు ప్రధాన మ్యాచ్‌లు ఆడతాయి. గత టోర్నీ వరకు ఉన్న సూపర్ సిక్స్ మ్యాచ్‌లను ఈసారి తీసేశారు. మూడు కొత్త జట్లు ఈసారి టి20 ప్రపంచకప్ ద్వారా మూడు కొత్త జట్లు ఈ ఫార్మాట్లో తొలిసారి ఆడబోతున్నాయి. నేపాల్, హాంకాంగ్, యూఏఈ అర్హత మ్యాచ్‌లలో బరిలోకి దిగుతున్నాయి. ఆతిథ్య బంగ్లాదేశ్‌తో పాటు, ఆ జట్టును ఆసియాకప్‌లో కంగుతినిపించిన అఫ్ఘానిస్థాన్, జింబాబ్వే, నెదర్లాండ్స్, ఐర్లాండ్ మిగిలిన జట్లు. అర్హత రౌండ్ గ్రూప్ ‘ఎ’: బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్, నేపాల్, హాంకాంగ్ గ్రూప్ ‘బి’:జింబాబ్వే, ఐర్లాండ్, యూఏఈ, నెదర్లాండ్స్ ఈ రెండు గ్రూప్‌ల నుంచి విజేతలుగా నిలిచిన జట్లు ప్రధాన దశకు అర్హత సాధిస్తాయి. ప్రధాన రౌండ్ (సూపర్ 10 సిరీస్) గ్రూప్-1: శ్రీలంక, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, క్వాలిఫయర్ (గ్రూప్ ‘బి’ విజేత) గ్రూప్-2: భారత్, వెస్టిండీస్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, క్వాలిఫయర్ (గ్రూప్ ‘ఎ’ విజేత) గ్రూప్-1, గ్రూప్-2 లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరతాయి. మార్చి 16 నుంచి 21 వరకు అర్హత రౌండ్ మ్యాచ్‌లు జరుగుతాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 1 వరకు ప్రధాన గ్రూప్‌ల మ్యాచ్‌లు జరుగుతాయి. ఏప్రిల్ 3, 4 తేదీల్లో సెమీఫైనల్స్ జరుగుతాయి. ఏప్రిల్ 6న ఫైనల్ జరుగుతుంది. ఒకవేళ ఏదైనా అంతరాయం కలిగితే రిజర్వ్ డే 7న మ్యాచ్ జరుగుతుంది. మహిళలూ సిద్ధం పురుషుల టోర్నీతో సమాంతరంగా మహిళలకూ టి20 ప్రపంచకప్ జరుగుతుంది. పురుషులకు ఇది ఐదో టి20 ప్రపంచకప్ కాగా... మహిళలకు మాత్రం నాలుగోది. 2009లో తొలిసారి పురుషులతో పాటు మహిళలకూ టోర్నీ నిర్వహణ ప్రారంభమైంది. మహిళల జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఐర్లాండ్ గ్రూప్ ‘బి’: భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్ రెండు గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరతాయి. ఎవరికెంతెంత? ఈసారి పురుషుల విభాగంలో విజేత జట్టుకు 11 లక్షల డాలర్లు (రూ. 6 కోట్ల 71 లక్షలు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి. రన్నరప్ జట్టుకు 5 లక్షల 50 వేల డాలర్లు (రూ. 3 కోట్ల 35 లక్షలు) దక్కుతాయి. సెమీఫైనల్స్‌లో ఓడిన జట్లు 2 లక్షల 75 వేల డాలర్ల (రూ. కోటీ 67 లక్షలు) చొప్పున అందుకుంటాయి. ప్రధాన రౌండ్లో ప్రతి మ్యాచ్ విజయానికి 40 వేల డాలర్ల (రూ. 24 లక్షల 43 వేలు) చొప్పున లభిస్తాయి. మహిళల విభాగంలో విజేత జట్టుకు 70 వేల డాలర్లు (రూ. 42 లక్షల 75 వేలు)... రన్నరప్ జట్టుకు 30 వేల డాలర్లు (రూ. 18 లక్షల 32 వేలు) ప్రైజ్‌మనీగా దక్కుతాయి.