టి20 కూడా ఇంగ్లండ్‌దే | Buttler Stars as England Beat Australia by 28 Runs | Sakshi
Sakshi News home page

టి20 కూడా ఇంగ్లండ్‌దే

Published Fri, Jun 29 2018 4:14 AM | Last Updated on Fri, Jun 29 2018 4:14 AM

Buttler Stars as England Beat Australia by 28 Runs - Sakshi

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌ పర్యటనలో ఆస్ట్రేలియా పరాజయం పరిపూర్ణమైంది. కంగారూలు ఏకైక టి20లో కూడా పరాజయంపాలై వెనుదిరిగారు. బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 28 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు సాధించింది.  జోస్‌ బట్లర్‌ (30 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) మరోసారి చెలరేగాడు. ఇంగ్లండ్‌ తరఫున ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ (22 బంతుల్లో) చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. జేసన్‌ రాయ్‌ (44; 6 ఫోర్లు), హేల్స్‌ (49; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం ఆసీస్‌ 19.4 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఆరోన్‌ ఫించ్‌ (41 బంతుల్లో 84; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగినా, మిగతావారంతా విఫలం కావడంతో ఓటమి తప్పలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement