Englaand
-
ఇంగ్లండ్ కెప్టెన్‌కు సర్జరీ.. భారత్‌తో సిరీస్‌కు దూరం!
ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత మహిళలతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఇంగ్లండ్ సారథి హీథర్ నైట్ దూరం కానుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో గాయపడిన నైట్.. ప్రస్తుతం తన తుంటి ఎముక గాయానికి సర్జరీ చేయించుకుంది. దీంతో ఆమె కొన్ని నెలలపాటు క్రికెట్‌కు దూరంగా ఉండనుంది. ఈ క్రమంలోనే భారత్‌తో జరగనున్న సిరీస్‌కు, మహిళల బిగ్‌బాష్ లీగ్‌కు నైట్ దూరం కానుంది. కాగా ఆమె ఈ గాయం కారణంగానే కామన్వెల్త్ గేమ్స్-2022, ది హండ్రెడ్ సీజన్ నుంచి తప్పుకుంది. ఇక ఇదే విషయాన్ని నైట్ కూడా దృవీకరించింది. "నేను నా తుంటి ఎముక గాయానికి సర్జరీ చేయించుకున్నాను. మళ్లీ ఎప్పటి మాదిరిగానే మైదానంలో పరిగెత్తడానికి సిద్దమవుతాను. అయితే దురదృష్టవశాత్తూ ఈ గాయం నన్ను భారత్ సిరీస్, మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో భాగం కాకుండా చేసింది. కానీ ఈ ఏడాది అఖరి నాటికి తిరిగి జట్టులోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను" నైట్ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. భారత్‌తో జరిగే సిరీస్‌కు నైట్ స్థానంలో ఆ జట్టు ఆల్‌రౌండర్ స్కైవర్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా ఆమెనే ఇంగ్లండ్ సారథిగా బాధ్యతలు నిర్వర్తించింది. కాగా ఇంగ్లండ్ పర్యటలో భాగంగా భారత్ మూడు టీ20లు మూడు వన్డేలు ఆడనుంది. సెప్టెంబర్ 10న చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా జరగనున్న తొలి టీ20తో భారత పర్యటన ప్రారంభం కానుంది. చదవండి: ILT20: జట్టును ప్రకటించిన షార్జా వారియర్స్.. మోయిన్ అలీతో పాటు! -
జోస్ బట్లర్ స్టన్నింగ్ క్యాచ్.. సూపర్‌మాన్‌లా డైవ్ చేస్తూ.. వీడియో వైరల్
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ అద్బుతమైన క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన సువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో.. మార్కస్ హారిస్ లెగ్‌సైడ్ దిశగా ఆడాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని కీపర్‌కు దూరంగా వెళ్లింది. ఈ క్రమంలో వికెట్ కీపర్ జోస్ బట్లర్ డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో మార్కస్ హారిస్ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. కాగా ఈ క్యాచ్ చూసి స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురైయ్యారు. ఇక బట్లర్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. ఇక ఈ రెండో టెస్ట్‌కు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్థానంలో స్టీవ్ స్మిత్ బాధ్యతలు చేపట్టాడు. చదవండి: కోహ్లికే కాదు.. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు.. కపిల్‌దేవ్ సంచలన వాఖ్యలు INSANE! Buttler pulls in an all-timer behind the stumps! #Ashes pic.twitter.com/v96UgK42ce — cricket.com.au (@cricketcomau) December 16, 2021 -
ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్
కేప్‌టౌన్: వరుసగా మూడో టి20 మ్యాచ్‌లోనూ అదరగొట్టిన ఇంగ్లండ్ జట్టు దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొమ్మిది వికెట్ల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టును చిత్తుగా ఓడించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 17.4 ఓవర్లలో కేవలం వికెట్ కోల్పోయి ఛేదించింది. డేవిడ్ మలాన్ (47 బంతుల్లో 99 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు), జాస్ బట్లర్ (46 బంతుల్లో 67 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) రెండో వికెట్‌కు అజేయంగా 167 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు 166 పరుగులతో జయవర్ధనే– సంగక్కర (శ్రీలంక–2010లో వెస్టిండీస్‌పై) పేరిట ఉన్న రికార్డును మలాన్, బట్లర్ సవరించారు. అంతకు ముందు దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్లకు 191 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (37 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), వాన్ డెర్ డసెన్ (32 బంతుల్లో 74 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) హడలెత్తించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 10.3 ఓవర్లలో 127 పరుగులు జత చేశారు. ఇంగ్లండ్ ‘టాప్’ ర్యాంక్‌లోకి... దక్షిణాఫ్రికాపై క్లీన్‌స్వీప్ సాధించడంతో ఇంగ్లండ్ జట్టు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 టీమ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాను రెండో స్థానానికి నెట్టేసి టాప్ ర్యాంక్‌ను అందుకుంది. టి20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో మలాన్ తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో మలాన్ 915 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. టి20 ర్యాంకింగ్స్‌లో ఓ బ్యాట్స్‌మన్ 915 రేటింగ్ పాయింట్లు సాధించడం ఇదే ప్రథమం. -
వచ్చే కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్
బర్మింగ్‌హామ్: మహిళా క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే దిశగా ఓ అడుగు పడింది. 2022లో ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా నిర్వహించే కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్‌నూ ఓ అంశంగా చేరుస్తూ కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్) గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత నవంబరులో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సంయుక్తంగా సమర్పించిన బిడ్‌ను పరిశీలించి ఆమోదించింది. ‘ఇది మహిళా క్రికెట్ విశ్వవ్యాప్తం కావడానికి, మహిళా సాధికారత సాధనకు లభించిన గొప్ప అవకాశం’ అని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. 1998లో కౌలాలంపూర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారిగా పురుషుల క్రికెట్‌ను ఓ క్రీడాంశంగా చేర్చారు. ఆ టోర్నీలో దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. తర్వాత మరెప్పుడూ క్రికెట్ ఇందులో భాగం కాలేదు. -
ఇంగ్లండ్ 285 ఆలౌట్
క్యాండీ: ఆల్‌రౌండర్ స్యామ్ కరన్ (119 బంతుల్లో 64; 1 ఫోర్, 6 సిక్స్‌లు) చివర్లో భారీ షాట్లతో విరుచుకుపడటంతో శ్రీలంకతో బుధవారం మొదలైన రెండో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులకు ఆలౌటైంది. బట్లర్ (63; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... బర్న్స్ (43; 5 ఫోర్లు), ఆదిల్ రషీద్ (31; 2 ఫోర్లు, సిక్స్) ఫర్వాలేదనిపించారు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో తడబడింది. లంక స్పిన్నర్లు దిల్రువాన్ పెరీరా (4/61), పుష్పకుమార (3/89), అఖిల ధనంజయ (2/80) ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు వరుస కట్టారు. జెన్నింగ్స్ (1), స్టోక్స్ (19), కెప్టెన్ రూట్ (14), మొయిన్ అలీ (10), ఫోక్స్ (19) నిరాశ పరిచారు. 225 పరుగులకే 9 వికెట్లు పడిన దశలో కరన్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. అండర్సన్ (7 నాటౌట్)తో కలిసి చివరి వికెట్‌కు 60 పరుగులు జోడించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. -
టి20 కూడా ఇంగ్లండ్‌దే
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్ పర్యటనలో ఆస్ట్రేలియా పరాజయం పరిపూర్ణమైంది. కంగారూలు ఏకైక టి20లో కూడా పరాజయంపాలై వెనుదిరిగారు. బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు సాధించింది. జోస్ బట్లర్ (30 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) మరోసారి చెలరేగాడు. ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (22 బంతుల్లో) చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. జేసన్ రాయ్ (44; 6 ఫోర్లు), హేల్స్ (49; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం ఆసీస్ 19.4 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఆరోన్ ఫించ్ (41 బంతుల్లో 84; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగినా, మిగతావారంతా విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. -
రాస్ రఫ్పాడించాడు
డ్యూనెడిన్: హోరాహోరీ, పోటాపోటీ వంటి పదాలకు సరైన నిర్వచనంగా సాగిన వన్డేలో ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్‌దే పైచేయి అయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రాస్ టేలర్ (147 బంతుల్లో 181 నాటౌట్; 17 ఫోర్లు, 6 సిక్స్‌లు) విరుచుకుపడిన వేళ న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ముందుగా ఇంగ్లండ్ 9 వికెట్లకు 335 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 49.3 ఓవర్లలో 5 వికెట్లకు 339 పరుగులు చేసి నెగ్గింది. మెరుపులా మొదలై... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు జేసన్ రాయ్ (42), బెయిర్‌స్టో (138; 14 ఫోర్లు, 7 సిక్స్‌లు) 77 పరుగులు జోడించి మంచి ఆరంభాన్నిచ్చారు. అనంతరం బెయిర్‌స్టో, రూట్ (102; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికె ట్‌కు 190 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 38వ ఓవర్లో 267/1తో నిలిచిన ఇంగ్లండ్ 400 పరుగులు చేసేలా కనిపించినా.. 21 పరుగుల తేడాతో 6 వికెట్లు కోల్పోయింది. భారీ ఛేదనలో కివీస్ విధ్వంసక ఓపెనర్లు గప్టిల్ (0), మున్రో (0) డకౌటయ్యారు. ఆ తర్వాత టేలర్... లాథమ్ (71; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో నాలుగో వికెట్‌కు 187 పరుగులు జోడించాడు. చివరి ఓవర్లో 3 పరుగులు చేయాల్సి ఉండగా... మూడో బంతిని నికోల్స్ సిక్స్‌గా మలచడంతో కివీస్ భారీ ఛేదన పూర్తయింది. ఐదో వన్డే శనివారం జరుగుతుంది. -
గెలుపు బాటలో ఆసీస్
సిడ్నీ: మార్ష్ సోదరులు షాన్, మిచెల్ అద్భుత సెంచరీలు చేయడంతో... యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఆస్ట్రేలియా విజయం ముంగిట నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌ను 649/7 వద్ద డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియాకు 303 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. ప్రస్తుతం జో రూట్ (42 బ్యాటింగ్), బెయిర్‌స్టో (17 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ మరో 210 పరుగులు వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్ కాపాడుకోవాలంటే ఇంగ్లండ్ చివరి రోజు పూర్తిగా బ్యాటింగ్ చేయాల్సి ఉండగా... ఆసీస్ మరో ఆరు వికెట్లు తీస్తే నాలుగో విజయాన్ని ఖాయం చేసుకుంటుంది. ఓవర్‌నైట్‌స్కోరు 479/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా ఆటలో మార్ష్ సోదరుల బ్యాటింగే హైలైట్. అన్నదమ్ములిద్దరూ ఒకరిని మించి ఒకరు దూకుడుగా ఆడటంతో.. ఇంగ్లండ్ బౌలర్లు ప్రేక్షక పాత్ర వహించారు. ఈ క్రమంలో ముందు షాన్ మార్ష్ (291 బంతుల్లో 156; 18 ఫోర్లు)... ఆ తర్వాత మిచెల్ మార్ష్ (145 బంతుల్లో 101; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకాలు పూర్తి చేసుకున్నారు. పాయింట్ దిశగా బంతిని పంపిన మిచెల్ మార్ష సెంచరీ సంబరాల్లో పడి రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తొలి పరుగు పూర్తవగానే పిచ్ మధ్యలో సోదరుడిని హత్తుకొని రెండో పరుగు పూర్తి చేయడం మరిచాడు. అనంతరం షాన్ మార్ష్ గుర్తుచేయడంతో క్రీజులోకి చేరి బతికిపోయాడు. ► ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అన్నదమ్ములు సెంచరీలు చేయడం ఇది మూడోసారి. గతంలో చాపెల్ సోదరులు గ్రెగ్, ఇయాన్ (1972లో)... ‘వా’ సోదరులు మార్క్, స్టీవ్ (2001లో)లు కూడా ఇంగ్లండ్ పైనే ఈ ఘనత సాధించడం విశేషం. ఓవరాల్‌గా టెస్టు క్రికెట్లో అన్నదమ్ములిద్దరూ ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేయడం ఇది ఎనిమిదో సారి. ► రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగుల వద్ద కుక్ టెస్టుల్లో 12 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఆరో బ్యాట్స్‌మన్‌గా కుక్ రికార్డు నమోదు చేశాడు. ► గత 80 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సిడ్నీలో ఆదివారం 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విపరీతమైన ఉక్కపోతతో ఇంగ్లండ్ బౌలర్లు ఉక్కిరిబిక్కిరయ్యారు. -
విశ్వ విజేత ఇంగ్లండ్
-
విశ్వ విజేత ఇంగ్లండ్
ప్రపంచ కప్ ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్... 31 నిమిషాలు ముగిసేసరికి 0–2తో వెనుకంజ... ఇలాంటి స్థితిలో ఏ జట్టయినా గెలుపుపై ఆశలు వదిలేసుకుంటుంది... కానీ ఇంగ్లండ్ పోరాటం ఆపలేదు. అద్భుతమైన ఆటతీరుతో కోలుకొని స్పెయిన్‌పై ఎదురుదాడికి దిగింది. వరుస గోల్స్‌తో ఉక్కిరిబిక్కిరి చేసింది. 46 నిమిషాల వ్యవధిలో ఏకంగా ఐదు గోల్స్ నమోదు చేసి అండర్–17 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో తొలిసారి విజేతగా నిలిచింది. 66,684 మంది ప్రేక్షకుల సమక్షంలో కొత్త చరిత్రను సృష్టించింది. కోల్‌కతా: భారతగడ్డపై తొలిసారి అట్టహాసంగా నిర్వహించిన ‘ఫిఫా’ అండర్–17 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ‘కిక్’ అదిరింది. ‘లయన్స్‘ విజృంభణతో ఆ జట్టు తొలిసారి జగజ్జేతగా నిలిచింది. శనివారం ఇక్కడి సాల్ట్‌లేక్ స్టేడియంలో భారీ సంఖ్యలో హాజరైన అభిమానులను అలరించిన ఫైనల్లో ఇంగ్లండ్ 5–2 తేడాతో స్పెయిన్‌ను చిత్తుగా ఓడించింది. ఇంగ్లండ్ తరఫున బ్రూస్టర్ (44వ నిమిషం), గిబ్స్ (58వ ని.లో), ఫిల్ ఫాడెన్ (69వ, 88వ ని.లో), మార్క్ గుహి (84వ ని.లో) గోల్స్ సాధించగా... స్పెయిన్ తరఫున సెర్గియో గోమెజ్ (10వ, 31వ ని.లో) రెండు గోల్స్ చేశాడు. ఇదే ఏడాది అండర్–20 ప్రపంచకప్‌ను కూడా గెలుచుకున్న ఇంగ్లండ్‌కు ఇది మరో చిరస్మరణీయ విజయం కావడం విశేషం. ఈ మెగా టోర్నీలో నాలుగోసారి ఫైనల్‌కు చేరిన స్పెయిన్ మళ్లీ రన్నరప్ టైటిల్‌తో సంతృప్తి చెందాల్సి వచ్చింది. మరోవైపు అటు ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన, ఇటు ప్రేక్షకుల అమితాభిమానం కలగలిసి ఈ వరల్డ్ కప్ భారత్‌లో ఆదరణ పరంగా సూపర్‌హిట్‌గా నిలవడం ఏఐఎఫ్ఎఫ్ సాధించిన అతి పెద్ద విజయం. వెనుకంజ నుంచి విజయం వైపు... మ్యాచ్ మొదలైన 47 సెకన్లలోనే ఇంగ్లండ్ ద్వయం బ్రూస్టర్–గిబ్స్ గోల్ అవకాశం సృష్టించినా అది సఫలం కాలేదు. అయితే 10వ నిమిషంలోనే గోమెజ్ చేసిన గోల్‌తో స్పెయిన్‌కు ఆధిక్యం దక్కింది. ఆ తర్వాత కూడా దాడులు కొనసాగించిన స్పెయిన్ 31వ నిమిషంలో మళ్లీ ఫలితం సాధించింది. ఇంగ్లండ్ రక్షణశ్రేణిని మరోసారి ఛేదించి గోమెజ్ మళ్లీ గోల్ నమోదు చేయడంతో ఇంగ్లండ్ విస్తుపోయింది. అయితే తొలి అర్ధభాగం ముగియడానికి కొద్దిసేపు ముందు హెడర్ ద్వారా బ్రూస్టర్ గోల్ సాధించడంతో ఇంగ్లండ్ కోలుకుంది. బ్రూస్టర్కు టోర్నీలో ఇది ఎనిమిదో గోల్ కావడం విశేషం. రెండో అర్ధ భాగంలో ఇంగ్లండ్ చెలరేగిపోయింది. 58వ నిమిషంలో ఫాడెన్ ఇచ్చిన పాస్‌ను సెసెగ్నాన్ అందుకోవడంలో విఫలమైనా... మరోవైపు నుంచి దూసుకొచ్చిన గిబ్స్ ఆరు అడుగుల దూరం నుంచి గోల్ కొట్టి స్కోర్ సమం చేశాడు. 69వ నిమిషంలో ఫాడెన్ చేసిన సునాయాస గోల్‌తో ఇంగ్లండ్‌కు ఆధిక్యం దక్కింది. ఆ తర్వాత గుహి 84వ నిమిషంలో చేసిన గోల్‌తో ఇంగ్లండ్‌ను విజయం దిశగా వెళ్లగా... మ్యాచ్ రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా ‘ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్’ ఫాడెన్ మరో గోల్‌తో ఇంగ్లండ్‌ను ఆనం దంలో ముంచాడు. అంతకుముందు బ్రెజిల్ 2–0తో మాలిపై విజయం సాధించి టోర్నీలో మూడో స్థానంలో నిలిచింది. -
క్వార్టర్ ఫైనల్లో ఇరాన్, స్పెయిన్
మార్గావ్ (గోవా): ఫిఫా అండర్–17 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇరాన్ కుర్రాళ్ల జోరు ప్రిక్వార్టర్స్‌లోనూ కొనసాగింది. ఈ టోర్నీలో పరాజయమన్నదే ఎరుగని ఇరాన్ తాజాగా 2–1 స్కోరుతో మెక్సికోను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన ఇతర ప్రిక్వార్టర్స్‌లో గెలుపొందిన స్పెయిన్, ఇంగ్లండ్, మాలి జట్లు కూడా క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాయి. గోవాలో జరిగిన మ్యాచ్‌లో ఇరాన్ ఆట ఆరంభంలోనే 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మైదానంలో ప్రత్యర్థి మెక్సికో రక్షణ శ్రేణి పేలవమైన ఆటతీరును సొమ్ము చేసుకున్న ఇరాన్ ఆటగాళ్లు మొహమ్మద్ షరిఫి (7వ ని.), అల్లాయర్ సయ్యద్ (11వ ని.) చెరో గోల్ చేశారు. మరోవైపు ఇరాన్ డిఫెండర్లతో పాటు, గోల్ కీపర్ అలీ ఘోలమ్ అంతే దీటుగా స్పందించడంతో గోల్‌పోస్ట్‌పై మెక్సికో చేసిన దాడులన్నీ నిష్ఫలమయ్యాయి. అయితే తొలి అర్ధభాగం ముగిసేందుకు కొన్ని నిమిషాల ముందు రాబెర్టొ డి లా రొసా (37వ ని.) చేసిన గోల్‌తో మెక్సికో... ఇరాన్ ఆధిక్యాన్ని తగ్గించగలిగింది. ద్వితీయార్ధంలో మరో గోల్ నమోదు కాలేదు. దీంతో 2–1తో ఇరాన్ ముందంజ వేసింది. గువాహటిలో జరిగిన మరో ప్రిక్వార్టర్స్‌లో చివరి నిమిషంలో చేసిన గోల్‌తో స్పెయిన్ 2–1తో ఫ్రాన్స్‌పై గెలిచింది. స్పెయిన్ తరఫున జువన్ మిరండ (44వ ని.), అబెల్ రూయిజ్ (90వ ని.) చెరో గోల్ సాధించగా, ఫ్రాన్స్ జట్టులో లెన్నీ పింటొర్ (34వ ని.) గోల్ చేశాడు. కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ పెనాల్టీ షూటౌట్లో 5–3తో జపాన్‌పై విజయం సాధించింది. గోవాలో జరిగిన రెండో మ్యాచ్‌లో మాలి 5–1తో ఇరాక్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. నేడు (బుధవారం) జరిగే రెండు ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఘనాతో నైజర్, బ్రెజిల్‌తో హోండూరస్ తలపడతాయి. -
సెంచరీ చేజార్చుకున్న అలెక్స్
లండన్: చాంపియన్ ట్రోఫిలో భాగంగా ఇంగ్లండ్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో 306 పరుగుల లక్ష్య చేదనకు దిగిన ఇంగ్లండ్ దీటుగా బదులిస్తుంది. ఓపెనర్ జాసన్ రాయ్(1) నిరాశపర్చగా మరో ఓపెనర్ అలెక్స్ హెల్స్, జో రూట్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. సెంచరి మిస్ చేసుకున్న అలెక్స్(11 ఫోర్లు, 2 సిక్సర్లతో 95) పరుగులు చేసి షబ్బీర్ రెహ్మాన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. ఇక జోరూట్ కూడా అర్ధ సెంచరీ సాధించడంతో రెండో వికెట్‌కు 159 పరుగులు జమయ్యాయి. జోరూట్(87), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (33) క్రీజులో ఉన్నారు. 37 ఓవర్లకు ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. బంగ్లా ఆటగాళ్లలో తమీమ్ ఇక్బాల్(128;142 బంతుల్లో 12 ఫోర్లు 3 సిక్సర్లు), ముష్ఫికర్ రహీమ్(79;72 బంతుల్లో 8 ఫోర్లు) లు బాధ్యాతయుతంగా ఆడటంతో గౌరవప్రదమైన స్కోరును ఇంగ్లండ్ ముందుంచారు.