Ashes 2021: Jos Buttler Takes Incredible Catch in Happening Pink-Ball Adelaide Test - Sakshi
Sakshi News home page

Ashes 2021-22: జోస్ బట్లర్ స్టన్నింగ్ క్యాచ్.. సూపర్‌మాన్‌లా డైవ్‌ చేస్తూ.. వీడియో వైరల్‌

Published Thu, Dec 16 2021 12:27 PM | Last Updated on Thu, Dec 16 2021 1:51 PM

Jos Buttler takes incredible catch in happening pink-ball Adelaide Test - Sakshi

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఆడిలైడ్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్ జోస్‌ బట్లర్‌ అద్బుతమైన క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ వేసిన సువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో.. మార్కస్ హారిస్ లెగ్‌సైడ్‌ దిశగా ఆడాడు. అయితే బంతి ఎడ్జ్‌ తీసుకుని కీపర్‌కు దూరంగా వెళ్లింది.

ఈ క్రమంలో వికెట్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌ డైవ్‌ చేస్తూ స్టన్నింగ్‌ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో మార్కస్ హారిస్ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. కాగా ఈ క్యాచ్‌ చూసి స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురైయ్యారు. ఇక బట్లర్‌ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియోలో వైరల్‌ అవుతోంది. ఇక ఈ రెండో టెస్ట్‌కు కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్ ‌స్థానంలో  స్టీవ్‌ స్మిత్‌ బాధ్యతలు చేపట్టాడు.

చదవండి: కోహ్లికే కాదు.. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు.. కపిల్‌దేవ్‌ సంచలన వాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement