రాస్‌ రఫ్పాడించాడు  | Cricket: Heroic Ross Taylor smashes Black Caps to series decider | Sakshi
Sakshi News home page

రాస్‌ రఫ్పాడించాడు 

Published Thu, Mar 8 2018 1:46 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

Cricket: Heroic Ross Taylor smashes Black Caps to series decider - Sakshi

డ్యూనెడిన్‌: హోరాహోరీ, పోటాపోటీ వంటి పదాలకు సరైన నిర్వచనంగా సాగిన వన్డేలో ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్‌దే పైచేయి అయింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ రాస్‌ టేలర్‌ (147 బంతుల్లో 181 నాటౌట్‌; 17 ఫోర్లు, 6 సిక్స్‌లు) విరుచుకుపడిన వేళ న్యూజిలాండ్‌ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ముందుగా ఇంగ్లండ్‌ 9 వికెట్లకు 335 పరుగులు చేయగా, న్యూజిలాండ్‌ 49.3 ఓవర్లలో 5 వికెట్లకు 339 పరుగులు చేసి నెగ్గింది.

మెరుపులా మొదలై... 
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు జేసన్‌ రాయ్‌ (42), బెయిర్‌స్టో (138; 14 ఫోర్లు, 7 సిక్స్‌లు) 77 పరుగులు జోడించి మంచి ఆరంభాన్నిచ్చారు. అనంతరం బెయిర్‌స్టో, రూట్‌ (102; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికె ట్‌కు 190 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 38వ ఓవర్‌లో 267/1తో నిలిచిన ఇంగ్లండ్‌ 400 పరుగులు చేసేలా కనిపించినా.. 21 పరుగుల తేడాతో 6 వికెట్లు కోల్పోయింది.
భారీ ఛేదనలో కివీస్‌ విధ్వంసక ఓపెనర్లు గప్టిల్‌ (0), మున్రో (0) డకౌటయ్యారు. ఆ తర్వాత టేలర్‌... లాథమ్‌ (71; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో నాలుగో వికెట్‌కు 187 పరుగులు జోడించాడు. చివరి ఓవర్లో 3 పరుగులు చేయాల్సి ఉండగా... మూడో బంతిని నికోల్స్‌ సిక్స్‌గా మలచడంతో కివీస్‌ భారీ ఛేదన పూర్తయింది. ఐదో వన్డే శనివారం జరుగుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement