వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో పర్యటించాల్సిన న్యూజిలాండ్ జట్టు తమ పర్యటను నిరవధికంగా వాయిదా వేసుకుంది. ట్రాన్స్-టాస్మాన్ ప్రత్యర్థులు మధ్య ఫిబ్రవరిలో మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ జరాగాల్సి ఉంది. న్యూజిలాండ్ క్వారంటైన్ నిభందనలు, సరిహద్దు నియంత్రణలు దృష్ట్యా ఈ పర్యటనను కివీస్ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. కొవిడ్-19 తీవ్రత దష్ట్యా ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ మధ్య వైట్-బాల్ సిరీస్ వాయిదా పడడం వరుసగా ఇది మూడో సారి.
కాగా రానున్న వేసవిలో ఆస్ట్రేలియా జట్టుకు వన్డే ఇంటర్నేషనల్ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ఇది ఇలా ఉంటే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలి అని భావించిన రాస్ టేలర్‌కు నిరాశే మిగలనుంది. కోవిడ్, ఒమిక్రాన్ తీవ్రత దృష్ట్యా న్యూజిలాండ్ ప్రభుత్వం కఠినమైన 10 రోజుల క్వారంటైన్ నిభందనలు విధించింది. కాగా త్వరలోనే ఈ పర్యటనకు సంబంధించిన రీషెడ్యూల్‌ను ప్రకటిస్తామని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ పేర్కొంది.
చదవండి: SL Vs Zim: శ్రీలంకకు జింబాబ్వే షాక్... 94 బంతుల్లో 102 పరుగులు.. కానీ పాపం కెప్టెన్..
Comments
Please login to add a commentAdd a comment