సిడ్నీ: న్యూజిలాండ్ వెటరన్ క్రికెటర్ రాస్ టేలర్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సుదీర్ఘ కాలంగా క్రికెట్ ఆడుతున్న టేలర్.. న్యూజిలాండ్ తరఫున అత్యధిక టెస్టు పరుగులు సాధించిన జాబితాలో టాప్‌కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో టేలర్ ఈ ఫీట్‌ను సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో టేలర్(22) నిరాశపరిచినప్పటికీ అత్యధిక టెస్టు పరుగులు సాధించిన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరిట ఉండేది. టెస్టుల్లో ఫ్లెమింగ్ 7,172 పరుగులు సాధించి ఇప్పటివరకూ ఆ దేశం తరఫున అగ్రస్థానంలో ఉన్నాడు. దాన్ని తాజాగా టేలర్ బ్రేక్ చేశాడు. ప్రస్తుతం టేలర్ 7,175 పరుగులతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ జాబితాలో టేలర్, ఫ్లెమింగ్‌ల తర్వాత బ్రెండన్ మెకల్లమ్(6,453), కేన్ విలియమ్సన్(6,379), మార్టిన్ క్రో(5,444)లు వరుస స్థానాల్లో ఉన్నారు.
ఆసీస్ క్లీన్‌స్వీప్..
కివీస్‌తో జరిగిన చివరిదైన మూడో టెస్టులో ఆసీస్ 279 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. కివీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే ఆలౌట్ చేయడం ద్వారా ఆసీస్ మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. 416 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కివీస్‌కు వరుసగా వికెట్లు కోల్పోయింది. కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో గ్రాండ్‌హోమ్(52) మినహా ఎవరూ రాణించలేదు. ఫలితంగా మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ ఐదు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించాడు. స్టార్క్ మూడు వికెట్లు సాధించగా, కమ్మిన్స్‌కు వికెట్ దక్కింది. తొలి రెండు టెస్టుల్లో కూడా ఆసీస్ భారీ విజయాల్ని ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.
మూడో టెస్టు
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 454 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 217/2 డిక్లేర్డ్
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 256 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 136 ఆలౌట్
Comments
Please login to add a commentAdd a comment