సెంచరీ చేజార్చుకున్న అలెక్స్
లండన్: చాంపియన్ ట్రోఫిలో భాగంగా ఇంగ్లండ్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో 306 పరుగుల లక్ష్య చేదనకు దిగిన ఇంగ్లండ్ దీటుగా బదులిస్తుంది. ఓపెనర్ జాసన్ రాయ్(1) నిరాశపర్చగా మరో ఓపెనర్ అలెక్స్ హెల్స్, జో రూట్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. సెంచరి మిస్ చేసుకున్న అలెక్స్(11 ఫోర్లు, 2 సిక్సర్లతో 95) పరుగులు చేసి షబ్బీర్ రెహ్మాన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. ఇక జోరూట్ కూడా అర్ధ సెంచరీ సాధించడంతో రెండో వికెట్‌కు 159 పరుగులు జమయ్యాయి. జోరూట్(87), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (33) క్రీజులో ఉన్నారు. 37 ఓవర్లకు ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. బంగ్లా ఆటగాళ్లలో తమీమ్ ఇక్బాల్(128;142 బంతుల్లో 12 ఫోర్లు 3 సిక్సర్లు), ముష్ఫికర్ రహీమ్(79;72 బంతుల్లో 8 ఫోర్లు) లు బాధ్యాతయుతంగా ఆడటంతో గౌరవప్రదమైన స్కోరును ఇంగ్లండ్ ముందుంచారు.