ఉత్కంఠభరితంగా బార్బడోస్‌లో జరిగిన మ్యాచ్‌లో టీ-20 ప్రపంచ కప్‌ను టీమిండియా దక్కించుకుంది. దీంతో టీమిండియా ఆటగాళ్లపై అభినందనలు వెల్లువెత్తాయి. ప్రధానంగా సూర్యకుమార్‌యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ హీరోలుగా నిలిచారు. అయితే జస్ప్రీత్ బుమ్రా తల్లి సన్నిహితురాలు, పొలిటికల్ జర్నలిస్టు చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఒకటి వైరల్‌గా మారింది.
ప్రపంచ కప్ ఫైనల్‌లో జస్ప్రీత్ బుమ్రా తన అద్భుతమైన ప్రదర్శనకు స్టార్ క్రికెటర్‌పై నా హీరో అంటూ తన ప్రేమను అభిమానాన్ని చాటుకున్నారు బుమ్రా తల్లి దల్జీత్‌కి బెస్ట్ ఫ్రెండ్ దీపాల్ త్రివేది.
‘‘ నాకున్న క్రికెట్ పరిజ్ఞానం శూన్యం.. విరాట్ కోహ్లీ అనుహ్క భర్తగా తెలుసు. అతని డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించినప్పుడు నాకు నచ్చుతుంది. ఒకప్పుడు సిగ్గరి.. ఇప్పుడు లెజెండ్' అంటూ బుమ్రాపై సుదీర్ఘ భావోద్వేగ పోస్ట్ పెట్టారు దీపాల్ త్రివేది. ఇందులో బుమ్రాతో తనకున్న అనుబంధాన్ని, అతడి పడ్డ కష్టాలను వివరంగా రాసుకొచ్చారు. అంతేకాదు బుమ్రా పుట్టినపుడు తొలుత చేతుల్లోకి తీసుకున్నఅదృష్టవంతురాల్ని తానే అంటూ సంతోషాన్ని ప్రకటించారు. అప్పుడే పుట్టిన బిడ్డను తాకడం అదే మొదటిసారి. అప్పటికే కుమార్తె ఉన్నప్పటికీ అది పెద్దగా గుర్తులేదు. బిడ్డ సన్నగా, బలహీనంగా ఉన్నాడు .. ఆ క్షణాలు ఇప్పటికీ గుర్తు అన్నారామె.
My cricket knowledge is Zero. I know Virat Kohli as Anushka's husband. He is so pleasant and I like when he tries to dance.
But this (long) post is about my hero. One day in December 1993, when my salary was less than Rs 800 a month, my best friend and next door neighbour… pic.twitter.com/uvWQmmAwwN— Deepal.Trivedi #Vo! (@DeepalTrevedie) June 30, 2024
అలాగే చిన్నప్పటినుంచీ బుమ్రా పట్టుదల, సంకల్పం గురించి వివరించారు. నిజంగా మా స్టోరీ బాలీవుడ్ సినిమా కంటే తక్కువేమీకాదు. బుమ్రా తండ్రి జస్బీర్ సింగ్ మరణించిన తరువాత తల్లి రోజుకు కనీసం 16-18 గంటలు పనిచేస్తూ చాలా కష్టపడేది. పొరుగువారిగా, కష్టాలు, నష్టాలు అన్నీ పంచుకున్నాం. ఒక చిన్న ప్లాస్టిక్‌బాల్‌తో బుమ్రా ఎపుడూ క్రికెట్ ఆడుతూ ఉండేవాడనీ, తనకు మాత్రం దల్జీత్ ఇల్లు స్వర్గధామం లాంటిదని తెలిపారు.
ఒకసారి తన ఇంక్రిమెంట్ డబ్బులతో బుమ్రాకు విండ్‌చీటర్ (జాకెట్) కొనిచ్చిన ఏకైక బహుమతిని కూడా దీపాల్ గుర్తు చేసుకున్నారు. జస్ప్రీత్ బుమ్రాకు గర్వమనేదే లేదు. వినయం ఏమాత్రం తగ్గలేదు. అతడ్ని చూసి ప్రతీ భారతీయుడు గర్వపడాలి. అతని నుండి నేర్చుకోవాలంటూ బుమ్రాపై ప్రశంసలు కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment