
టి20 ప్రపంచకప్ తర్వాత...
అంతర్జాతీయ క్రికెట్‌కు ఆఫ్రిది గుడ్‌బై
కరాచీ : వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టి20 ప్రపంచ కప్ తర్వాత తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటానని పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది ప్రకటించాడు. ఈ టోర్నీలో కెప్టెన్‌గా పాక్ జట్టుకు టైటిల్ అందించాలనేదే తన లక్ష్యమని అతను పేర్కొన్నాడు. టెస్టుల నుంచి ఐదేళ్ల క్రితమే తప్పుకున్న ఆఫ్రిది, ఇటీవల ప్రపంచకప్‌తో వన్డేలకు కూడా వీడ్కోలు పలికాడు.
ప్రస్తుతం ఒక్క టి20 ఫార్మాట్‌లోనే ఆడుతున్న 35 ఏళ్ల ఆఫ్రిది తన కెరీర్‌లో 78 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లలో పాక్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 1154 పరుగులు చేసిన అతను, 81 వికెట్లు పడగొట్టాడు.