మహిళల టి20 ప్రపంచకప్
సిలెట్: కీలక మ్యాచ్‌లో విజయం సాధించిన దక్షిణాఫ్రికా జట్టు మహిళల టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం న్యూజిలాండ్‌తో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 114 పరుగులు సాధించింది.
అనంతరం దక్షిణాఫ్రికా 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. మిగ్నాన్ డూ ప్రీజ్ (47 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్ధసెంచరీతో దక్షిణాఫ్రికా విజయంలో కీలకపాత్ర పోషించింది. గ్రూప్ ‘ఎ’లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఆరేసి పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్ ఆధారంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరాయి. గ్రూప్ ‘బి’ నుంచి ఇంగ్లండ్, వెస్టిండీస్ సెమీఫైనల్లోకి ప్రవేశించాయి.
సెమీస్‌లో దక్షిణాఫ్రికా
Published Tue, Apr 1 2014 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 AM
Advertisement
Advertisement