
లండన్: ఇంగ్లండ్ మహిళల జట్టుకు తొలిసారి మహిళా క్రికెటర్‌నే హెడ్ కోచ్‌గా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నియమించింది. ఆ్రస్టేలియా మాజీ క్రికెటర్ లీసా కెయిట్లీకి ఈ అవకాశం దక్కింది. 48 ఏళ్ల లీసా 9 టెస్టుల్లో, 48 వన్డేల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఇప్పటి వరకు మార్క్ రాబిన్సన్ ఇంగ్లండ్ మహిళల జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. అయితే యాషెస్ సిరీస్‌లో ఓటమి తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే జనవరిలో లీసా తన బాధ్యతలు స్వీకరిస్తుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ మహిళల వన్డే జట్టు వరల్డ్ చాంపియన్‌గా ఉండగా... టి20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరింది. ప్రస్తుతం లీసా బిగ్ బాష్ టి20 లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తోంది.