ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్ల హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఇవాళ (సెప్టెంబర్ 3) అధికారికంగా ప్రకటించింది. మెక్‌కల్లమ్ 2022 నుంచి ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. అతని కాంట్రాక్ట్‌ను ఈసీబీ 2027 వరకు పొడిగించింది.
మెక్‌కల్లమ్ పూర్తి స్థాయి ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్‌గా వచ్చే ఏడాది జనవరి నుంచి బాధ్యతలు చేపడతాడు. భారత్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి మెక్‌కల్లమ్ ప్రస్తానం మొదలుకానుంది. అనంతరం జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ మెక్‌కల్లమ్ ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు.
వచ్చే ఏడాది జనవరి వరకు ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్ల తాత్కాలిక హెడ్ కోచ్‌గా మార్కస్ ట్రెస్కోథిక్ వ్యవహరిస్తాడు. త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌కు, ఆతర్వాత విండీస్ పర్యటనకు ట్రెస్కోథిక్ ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా పని చేస్తాడు.
కాగా, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్ల హెడ్ కోచ్‌గా ఉన్న మాథ్యూ మాట్స్ ఇటీవలే బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. మాట్స్ ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా 2022లో ఛార్జ్ తీసుకున్నాడు. అయితే అతను అనివార్య కారణాల వల్ల తన నాలుగేళ్ల కాంట్రాక్ట్‌ను పూర్తి చేయకుండా మధ్యలోనే వైదొలిగాడు. మాట్స్ వైదొలిగిన నెల వ్యవధిలోనే ఈసీబీ మెక్‌కల్లమ్‌ను వన్డే, టీ20 జట్లకు హెడ్ కోచ్‌గా నియమించింది. మాట్స్ ఆధ్వర్యంలో ఇంగ్లండ్ 2022 టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment