మూడో టి20 రద్దు | India Women Vs South Africa Women 3rd T20 Match Abandoned Due To Wet Outfield | Sakshi
Sakshi News home page

మూడో టి20 రద్దు

Published Mon, Sep 30 2019 3:52 AM | Last Updated on Mon, Sep 30 2019 3:52 AM

India Women Vs South Africa Women 3rd T20 Match Abandoned Due To Wet Outfield - Sakshi

 సూరత్‌: భారత్, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన మూడో టి20 మ్యాచ్‌ వర్షార్పణమైంది. ఎడతెరిపిలేని వర్షాలతో ఇక్కడి మైదానం తడిసి ముద్దయింది. దీంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ రద్దయింది. 7.30 గంటలకు పరిస్థితిని సమీక్షించిన అంపైర్లు మ్యాచ్‌ నిర్వహణ అసాధ్యమని తేల్చారు. సిరీస్‌లో వరుసగా రద్దయిన రెండో మ్యాచ్‌ ఇది. గురువారం రెండో టి20 మ్యాచ్‌ కూడా వర్షం వల్ల జరగలేదు. ఐదు మ్యాచ్‌ల పొట్టి సిరీస్‌లో తొలి టి20 గెలిచిన భారత మహిళల జట్టు 1–0తో ఆధిక్యంలో ఉంది. నాలుగో మ్యాచ్‌ కూడా ఇక్కడే మంగళవారం జరుగుతుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement