రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ‘ఎ’ 164/7
ఐదు వికెట్లతో మెరిసిన మిన్ను మణి
గోల్డ్‌కోస్ట్: మరోసారి బౌలర్లు రాణించడంతో... ఆ్రస్టేలియా ‘ఎ’ మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక అనధికారిక టెస్టుపై భారత ‘ఎ’ మహిళల జట్టు పట్టు కోల్పోలేదు. 28 పరుగుల స్వల్ప ఆధిక్యం పొందిన ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 60 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.
ప్రస్తుతం ఆ్రస్టేలియా ‘ఎ’ ఓవరాల్ ఆధిక్యం 192 పరుగులకు చేరుకుంది. మ్యాడీ డార్క్ (54 బ్యాటింగ్; 2 ఫోర్లు), లిల్లీ మిల్స్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన భారత ‘ఎ’ జట్టు కెప్టెన్, ఆఫ్ స్పిన్నర్ మిన్ను మణి రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆకట్టుకుంది. మిన్ను 20 ఓవర్లలో 6 మెయిడెన్లు వేసి 47 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది.
ప్రియా మిశ్రా, సయాలీలకు ఒక్కో వికెట్ దక్కింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 100/2తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత ‘ఎ’ జట్టు మరో 84 పరుగులు జోడించి మిగతా 8 వికెట్లను కోల్పోయింది. శ్వేత సెహ్రావత్ (40; 3 ఫోర్లు), తేజల్ హసాబ్నిస్ (32; 2 ఫోర్లు), సయాలీ (21; 2 ఫోర్లు) రాణించారు.
Comments
Please login to add a commentAdd a comment