ఆసియా స్క్వాష్
హాంకాంగ్: ఆసియా స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన దీపికా పల్లికల్ సారథ్యంలోని భారత మహిళల జట్టు బుధవారం ఇరాన్‌తో జరిగిన తమ తొలిమ్యాచ్‌లో 3-0 తేడాతో గెలుపొందింది. సౌరవ్ ఘోషల్ నేతృత్వంలోని పురుషుల జట్టు కూడా 3-0 తేడాతోనే ఇరాన్‌పై విజయం సాధించింది.
మహిళల జట్టులో దీపిక 11-5, 11-0, 11-5తో డోలాటిజడెహ్‌పై గెలుపొందగా, జోష్నా చినప్ప 11-6, 11-4, 11-7తో మౌసావిజడెహ్‌పై, అనకా అలంకమొని 11-5, 11-1, 11-3తో హైదరీ ఫతేమేపై గెలిచి భారత్‌కు తిరుగులేని ఆధిక్యాన్నందించారు. ఇక పురుషుల జట్టులో సౌరవ్ 11-4, 11-5, 11-3తో మొహమ్మద్ రెజాను ఓడించగా, మహేశ్ మంగోంకర్ 11-3, 11-5, 11-4తో మలెస్కమెట్ నవీద్‌పై, హరిందర్‌పాల్ సింగ్ 11-6, 11-8, 12-10తో మహమ్మద్ హొస్సేన్‌పై గెలుపొందారు.
భారత జట్ల శుభారంభం
Published Thu, Jun 12 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 8:38 AM
Advertisement
Advertisement