భారత్‌కు నాలుగో ఓటమి | Fourth loss to India | Sakshi
Sakshi News home page

భారత్‌కు నాలుగో ఓటమి

Published Sat, May 20 2017 1:08 AM | Last Updated on Tue, Sep 5 2017 11:31 AM

Fourth loss to India

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న హాకీ సిరీస్‌లో భారత మహిళల జట్టు ఏమాత్రం మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోతోంది. తాజాగా శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లోనూ భారత్‌ 0–3తో ఓడింది. దీంతో ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్‌ 4–0తో తిరుగులేని ఆధిక్యంతో ఉంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో పర్యాటక జట్టును కంగుతినిపించిన కివీస్‌ ఈ మ్యాచ్‌లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

14వ నిమిషంలో రాచెల్‌ మెక్‌కాన్‌ గోల్‌ చేయగా, 17వ నిమిషంలో టెస్సా జాప్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో జట్టు 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 26వ నిమిషంలో రాచెల్‌ చేసిన మరో గోల్‌తో అర్ధభాగం ముగిసేసరికి ఆతిథ్య జట్టు 3–0కి వెళ్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement