భారత్‌కు నాలుగో ఓటమి
హామిల్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న హాకీ సిరీస్‌లో భారత మహిళల జట్టు ఏమాత్రం మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోతోంది. తాజాగా శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లోనూ భారత్ 0–3తో ఓడింది. దీంతో ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ 4–0తో తిరుగులేని ఆధిక్యంతో ఉంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో పర్యాటక జట్టును కంగుతినిపించిన కివీస్ ఈ మ్యాచ్‌లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
14వ నిమిషంలో రాచెల్ మెక్కాన్ గోల్ చేయగా, 17వ నిమిషంలో టెస్సా జాప్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో జట్టు 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 26వ నిమిషంలో రాచెల్ చేసిన మరో గోల్‌తో అర్ధభాగం ముగిసేసరికి ఆతిథ్య జట్టు 3–0కి వెళ్లింది.