Womens worldcup-2017
-
మహిళా క్రికెటర్లకు బంపర్ ఆఫర్..
న్యూఢిల్లీ: ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన భారత మహిళా జట్టులోని రైల్వే క్రికెటర్లకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. పదోన్నతులతో సహా నగదు ప్రోత్సాహకాలిస్తామని, భారత్ జట్టు ఫైనల్లో గెలువాలని ఆకాంక్షిస్తూ ప్రకటన చేశారు. ఈ విషయాన్ని రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్( ఆర్ఎస్పీబీ) సెక్రటరీ రేఖా యాదవ్ మీడియాకు తెలిపారు. మిథాలీ సేనలోని 15 మంది సభ్యుల్లో 10 మంది రైల్వే ఉద్యోగులు ఉండటం విశేషం. కెప్టెన్ మిథాలీతో సహా వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, ఎక్తా బిష్త్, పూనమ్ రౌత్, వేధ కృష్ణమూర్తి, పూనమ్ యాదవ్, సుష్మా వర్మ, మోనా మెశ్రామ్, రాజేశ్వరి గైక్వాడ్, నుజాత్ పర్విన్‌లు రైల్వే ఉద్యోగులే. వీరి అద్భుత ప్రదర్శనతోనే భారత్ ఫైనల్‌కు చేరిందని రైల్వే శాఖ సంతోషం వ్యక్తం చేసింది. మిథాలీ నిలకడగా ఆడుతూ వన్డెల్లో ప్రపంచ రికార్డు నమోదు చేయగా, వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సెమీస్‌లో ఆస్ట్రేలియా పై తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. రాజేశ్వరి గైక్వాడ్, ఎక్తా బిష్త్ బౌలింగ్‌తో చెలరేగగా, వేద కృష్ణమూర్తి న్యూజిలాండ్‌తో మెరుపు బ్యాటింగ్ చేసింది. -
దంచికొట్టిన మిథాలీ సేన..
♦ ఆసీస్‌కు భారీ లక్ష్యం ♦ సెంచరితో కదం తొక్కిన హర్మన్ ప్రీత్ .. డెర్బీ: మహిళల ప్రపంచకప్ లో మిథాలీ సేన ఆస్ట్రేలియాకు 282 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్థేశించింది. భారత బ్యాట్ ఉమెన్‌లో హర్మన్ ప్రీత్ అద్వితీయమై బ్యాటింగ్‌తో భారత్ నిర్ణీత 42 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. హర్మన్ ప్రీత్ (115 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సులతో 171 నాటౌట్) కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. దీంతో కౌర్ మహిళల వన్డే క్రికెట్లో ఇన్నింగ్స్ అత్యధిక పరుగులు సాధించిన ఐదో బ్యాట్స్ ఉమెన్‌గా గుర్తింపు పొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన మిథాలీసేనకు ఓపెనర్లు స్మృతి మంధన(6), పూనమ్ రౌత్(14)లు శుభారంబాన్ని అందించలేకపోయారు. దీంతో 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మిథాలీ, కౌర్ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. జట్టు స్కోరు 101 వద్ద మిథాలీ(36) బీమ్ప్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అవడంతో మూడో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం హర్మన్ ప్రీత్ దీప్తిశర్మతో రెచ్చిపోయి ఆడటంతో 90 బంతుల్లోనే కెరీర్లో మూడో సెంచరీ సాధించింది. దూకుడుగా ఆడుతూ క్రీజులో హర్మన్‌ప్రీత్ ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించింది. కౌర్ ఇన్నింగ్స్‌లో 20 ఫోర్లు, ఏడు సిక్స్‌లు కొట్టడం విశేషం. ఆసీస్ బౌలర్ గార్డెనర్ బౌలింగ్‌లో కౌర్ రెండు సిక్సలు, రెండు ఫోర్లతో 23 పరుగులు రాబట్టింది. చివర్లో దీప్తీ శర్మ(25), వేదకృష్ణమూర్తి(16 నాటౌట్)లు దూకుడుగా ఆడటంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. ఇక ఆసీస్ బౌలర్లలో విలాని, గార్డనర్, బీమ్స్, స్కట్లకు చెరో వికెట్ దక్కింది. -
ఆదిలోనే ఆసీస్‌కు కష్టాలు
డెర్బీ: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళా బ్యాటింగ్ విభాగం అదరగొట్టగా.. మేం ఏమాత్రం తక్కువ కాదంటూ బౌలర్లు చెలరేగుతున్నారు. 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 21 పరుగలకే మూడు వికెట్లు కోల్పోయి ఆ జట్టు కష్టాల్లో పడింది. పాండే తన తొలి ఓవర్ రెండో బంతికే ఆసీస్ జట్టు ఓపెనర్ మూనీ(1)ని క్లీన్‌బౌల్డ్ చేసింది. అనంతరం గోస్వామి కెప్టెన్ లాన్నింగ్(0)ను ఔట్ చేసింది. బోల్టన్ (14)ను దీప్తీ శర్మ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్‌కు చేర్చింది. 12 ఓవర్లకు ఆసీస్ 3 వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది. క్రీజులో విలాని(20), పెర్రీ(17)లు పోరాడుతున్నారు. -
సెంచరితో కదం తొక్కిన హర్మన్ ప్రీత్ ..
♦ కెరీర్లో మూడో సెంచరీ సాధించిన కౌర్ డెర్బీ: మహిళల ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో భారత బ్యాట్ ఉమెన్‌లో హర్మన్ ప్రీత్ అద్వితీయమై బ్యాటింగ్‌తో చెలరేగింది. హర్మన్ ప్రీత్ 115 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సులతో 171పరుగులు చేసి నౌటౌట్‌గా వన్డే కెరీర్లో అత్యుత్తమ స్కోరు నమోదు చేసింది. దీంతో కౌర్ మహిళల వన్డే క్రికెట్లో ఇన్నింగ్స్ అత్యధిక పరుగులు సాధించిన ఐదో బ్యాట్స్ ఉమెన్‌గా గుర్తింపు పొందింది. తొలుత కెప్టెన్ మిథాలీతో ఆచితూచి ఆడిన కౌర్ తర్వాత చెలరేగి ఆడింది. కేవలం 90 బంతుల్లో సెంచరీ పూర్తిచేసిన కౌర్ కెరీర్లో మూడో సెంచరీ సాధించింది. సెంచరీ అనంతరం ఆసీస్ బౌలర్లు కౌర్ ఓ ఆట ఆడుకుంది. బంతిని బౌండరీకి బాధడమే లక్ష్యంగా చెలరేగింది. ఆసీస్ బౌలర్ గార్డెనర్ వేసిన ఓ ఓవర్లలో కౌర్ రెండు సిక్సలు, రెండు ఫోర్లతో 23 పరుగులు రాబట్టింది. కౌర్ ఈ ఇన్నింగ్స్‌లో అలవోకగా 20 ఫోర్లు, 7 సిక్సులు కొట్టడం విశేషం. దీంతో భారత్ ఆసీస్‌కు 282 పరుగలు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. -
టాస్ నెగ్గిన మిథాలీ సేన..
డెర్బీ: మహిళల ప్రపంచకప్ భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో సెమీస్ లో మిథాలీ సేన టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను అంపైర్లు 42 ఓవర్లకు కుదించారు. ఓవర్ల కుదింపుతో ఇద్దరి బౌలర్లకు 9 ఓవర్లు, మిగిలిన ముగ్గురికి 8 ఓవర్లు వేసే అవకాశం ఇచ్చారు. ఇక ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. మిథాలీ రాజ్ నేతృత్వంలోనే భారత మహిళల క్రికెట్ జట్టు మరో కీలక సమరానికి సన్నద్ధమైంది. ఆస్ట్రేలియాతో టోర్నీ లీగ్ దశలోని పరాజయం భారత్‌కు ప్రతికూలంగా కనిపిస్తున్నా... అచ్చొచ్చిన మైదానంలో అనూహ్య ఫలితం సాధించగలమనే విశ్వాసంతో మిథాలీ సేన ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ 2005 తర్వాత ప్రపంచకప్‌లో మరోసారి ఫైనల్ చేరినట్లవుతుంది. లీగ్ దశలో భారత్ 5 విజయాలు సాధించగా, ఆస్ట్రేలియా 6 గెలిచింది. ఇరు జట్ల మధ్య పోరులో కంగారూలు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. తుది జట్ల వివరాలు భారత్: మిథాలీ రాజ్ (కెప్టెన్), స్మృతి మంధన, పూనమ్ రౌత్, హర్మన్‌ప్రీత్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ, శిఖా పాండే, సుష్మ వర్మ, జులన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్. ఆస్ట్రేలియా: మెగ్ లానింగ్ (కెప్టెన్), మూనీ, బోల్టన్, ఎలీస్ పెర్రీ, విలాని, బ్లాక్వెల్, హీలీ, ఆష్లీ గార్డ్నర్, జొనాసెన్, మెగాన్ షుట్, క్రిస్టన్ బీమ్స్