టాస్ నెగ్గిన మిథాలీ సేన..
డెర్బీ: మహిళల ప్రపంచకప్ భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో సెమీస్ లో మిథాలీ సేన టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను అంపైర్లు 42 ఓవర్లకు కుదించారు. ఓవర్ల కుదింపుతో ఇద్దరి బౌలర్లకు 9 ఓవర్లు, మిగిలిన ముగ్గురికి 8 ఓవర్లు వేసే అవకాశం ఇచ్చారు. ఇక ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.
మిథాలీ రాజ్ నేతృత్వంలోనే భారత మహిళల క్రికెట్ జట్టు మరో కీలక సమరానికి సన్నద్ధమైంది. ఆస్ట్రేలియాతో టోర్నీ లీగ్ దశలోని పరాజయం భారత్‌కు ప్రతికూలంగా కనిపిస్తున్నా... అచ్చొచ్చిన మైదానంలో అనూహ్య ఫలితం సాధించగలమనే విశ్వాసంతో మిథాలీ సేన ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ 2005 తర్వాత ప్రపంచకప్‌లో మరోసారి ఫైనల్ చేరినట్లవుతుంది. లీగ్ దశలో భారత్ 5 విజయాలు సాధించగా, ఆస్ట్రేలియా 6 గెలిచింది. ఇరు జట్ల మధ్య పోరులో కంగారూలు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
తుది జట్ల వివరాలు
భారత్: మిథాలీ రాజ్ (కెప్టెన్), స్మృతి మంధన, పూనమ్ రౌత్, హర్మన్‌ప్రీత్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ, శిఖా పాండే, సుష్మ వర్మ, జులన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్.
ఆస్ట్రేలియా: మెగ్ లానింగ్ (కెప్టెన్), మూనీ, బోల్టన్, ఎలీస్ పెర్రీ, విలాని, బ్లాక్‌వెల్, హీలీ, ఆష్లీ గార్డ్‌నర్, జొనాసెన్, మెగాన్ షుట్, క్రిస్టన్ బీమ్స్