
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు వేదికగా జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా నాలుగో వన్డే మ్యాచ్‌పై బీసీసీఐ అధికారిక ట్విట్టర్‌లో ఓ పోస్టు చేసింది. మ్యాచ్‌కు సంబంధించిన ఈ పోస్టుపై నెటిజన్లు బీసీసీఐ తప్పిదాన్ని గుర్తించారు. మ్యాచ్ విషయాలను అప్‌డేట్ ఇచ్చే ఆతృతలో బీసీసీఐ పప్పులో కాలేసింది. నాలుగో వన్డేకు బదులు టీ20 అని ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ టాస్ గెలిచాడనే విషయాన్ని పేర్కొంది. తప్పును గుర్తించిన నెటిజన్లు ‘బీసీసీఐ ఇది వన్డే.. టీ20 కాదు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. పొరపాటు గుర్తించిన బీసీసీఐ ఆ ట్వీట్‌ను తొలిగించింది. కానీ నెటిజన్లు మాత్రం స్క్రీన్ షాట్‌లు తీసీ మరి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. బీసీసీఐ అధికారిక ట్విట్టర్ 53 లక్షల ఫాలోవర్లున్నారు.