
సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌ను నేడు (శుక్రవారం) హైదరాబాద్ వేదికగా జరిగే భారత్-ఆస్ట్రేలియా అమీతుమీ టీ20 మ్యాచ్‌కు హాజరవ్వాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కోరారు. మూడు టీ20 సిరీస్‌లో భాగంగా ఇరుజట్లు చెరొక మ్యాచ్ గెలిచి తుది సమరానికి సిద్దమైన విషయం తెలిసిందే.
ఓ జాతీయ చానెల్ దీపావళి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన చిట్‌చాట్ ప్రోగ్రామ్ షూటింగ్‌లో పాల్గొన్న కోహ్లి, అమీర్ ఖాన్‌ను హైదరాబాద్ మ్యాచ్‌కు ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అంతేగాకండా చీర్స్ గర్ల్స్ మధ్య ఖాన్ గ్యాలరీలో నిలబడాలని కోహ్లి కోరుకున్నట్లు సమాచారం. ఇటీవల అమీర్‌ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ టీవీషో షూట్‌కు కోహ్లి హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోహ్లి తన జెర్సీని ఖాన్ బాయ్‌కు గిఫ్ట్‌గా అందజేశాడు. కోహ్లి కోరిక మేరకు అమీర్‌ఖాన్ హైదరాబాద్ వచ్చారని, క్రికెటర్లు బస చేసిన హోటల్లోనే బస చేశారని, టీమిండియా క్రికెటర్లను కలిసనట్లు తెలుస్తోంది. కోహ్లి ఇచ్చిన జెర్సీ ధరించి మరి కొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఆఖరి సమరానికి ఖాన్ బాయ్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment