ప్రతీకాత్మక చిత్రం
సిడ్నీ : ఈ ఏడాది భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్ట్ సిరీస్‌లో డే నైట్ టెస్ట్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. ఆస్ట్రేలియా అంతర్జాతీయ మ్యాచ్ వేదికల తేదీలను సీఏ విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఏ సీఈవో జేమ్స్ సదర్లాండ్, బోర్డు అధికారులు అడిలైడ్ వేదికగా జరిగే భారత్-ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌ను డేనైట్ నిర్వహించే దిశగా బీసీసీఐతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ‘ భారత్ తో అడిలైడ్ వేదికగా జరిగే టెస్టును డే నైట్ నిర్వహించాలని మేం భావిస్తున్నాం. ఆ దిశగా మా ప్రయత్నాలు చేపట్టాం. మరి కొద్ది రోజుల్లో ఈ విషయం స్పష్టత వస్తుందని ఆశిస్తున్నాం.’ అని జేమ్స్ సదర్లాండ్ తెలిపారు.
ఇక భారత్‌తో జరిగే నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో అడిలైడ్ వేదికగా జరిగే తొలి మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి 10 మధ్య జరగనుంది. ఇప్పటికే అడిలైడ్ మైదానం గత మూడేళ్లుగా నాలుగు డే నైట్ టెస్టు మ్యాచ్(న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఇంగ్లండ్)లకు ఆతిథ్యం ఇచ్చింది. అదే విధంగా కొత్త క్యాలెండర్‌లో లైట్స్ కింద భారత్‌తో మరో మ్యాచ్‌కు వేదిక కావాలని సీఏ భావిస్తోంది.
భవిష్యత్తు డే నైట్ టెస్ట్ క్రికెట్‌దేనని క్రికెట్‌ఆస్ట్రేలియా గట్టిగా నమ్ముతోంది. దీంతోనే ఈ ఫార్మట్‌ను రక్షించవచ్చని, టెలివిజన్ రేటింగ్స్, ప్రేక్షక ఆదరణను పొందవచ్చిన భావిస్తోంది. 2018 నవంబరు 21 నుంచి 2019 జనవరి 18 వరకు భారత్-ఆసీస్ మధ్య టీ20, టెస్టు, వన్డే సిరీస్‌లు జరగనున్నట్లు పేర్కొంది. ఈ పర్యటనలో భారత్ ఆతిథ్య ఆసీస్‌తో మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. పర్యటనలో టీ20 సిరీస్‌తో భారత్ తన పర్యటనను ప్రారంభించనుంది. భారత్‌తో జరిగే మూడు సిరీస్‌లకు బాల్ ట్యాంపరింగ్‌తో నిషేదం ఎదుర్కొంటున్న ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్ క్రాప్ట్ అందుబాటులో ఉండటం లేదు.
భారత్ ఆస్ట్రేలియా షెడ్యూల్:
తొలి టీ20: నవంబరు 21- గబ్బా
రెండో టీ20: నవంబరు 23- మెల్‌బోర్న్
మూడో టీ20: నవంబరు 25- సిడ్నీ
తొలి టెస్టు: డిసెంబరు 6-10 - ఆడిలైట్
రెండో టెస్టు: డిసెంబరు 14-18 - పెర్త్
మూడో టెస్టు: డిసెంబరు 26-30 - మెల్‌బోర్న్(బాక్సింగ్ డే టెస్టు)
నాలుగో టెస్టు: జనవరి 3- సిడ్నీ
మొదటి వన్డే: జనవరి 12- సిడ్నీ
రెండో వన్డే: జనవరి 15- ఆడిలైట్
మూడో వన్డే: జనవరి 18- మెల్‌బోర్న్
Comments
Please login to add a commentAdd a comment