కసాయి వాడి దగ్గర గొర్రెల్లా టీమిండియా! | Indian batsmen were like lambs to the slaughter,says Boycott | Sakshi
Sakshi News home page

కసాయి వాడి దగ్గర గొర్రెల్లా టీమిండియా!

Aug 18 2014 7:21 PM | Updated on Sep 2 2017 12:04 PM

కసాయి వాడి దగ్గర గొర్రెల్లా టీమిండియా!

కసాయి వాడి దగ్గర గొర్రెల్లా టీమిండియా!

ఇంగ్లండ్ పై ఘోర వైఫల్యం చవిచూసిన భారత్ పరిస్థితిని చూస్తే జాలేస్తుందని మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ జెఫ్రీ బాయ్ కాట్ అభిప్రాయపడ్డాడు.

లండన్: ఇంగ్లండ్ పై ఘోర వైఫల్యం చవిచూసిన భారత్ ను చూస్తే జాలేస్తుందని మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ జెఫ్రీ బాయ్ కాట్ తెలిపాడు. భారత జట్టు సమిష్టిగా వైఫల్యం చెంది టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించడం మాత్రం నిజంగా చాలా బాధగా ఉందన్నారు. సోమవారం భారత ఆటగాళ్ల ప్రదర్శనపై డైలీ టెలీ గ్రాఫ్ కు రాసిన వ్యాసంలో బాయ్ కాట్ వ్యంగాస్త్రాలు సంధించారు. టీమిండియా బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతోనే దారుణమైన ఓటమిని చవిచూసి సిరీస్ ను కోల్పోయారన్నారు. 'భారత్ ఆటగాళ్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అసలు వారు ఆడిన తీరు సరిగా లేదు. బౌలింగ్ అనుకూలించే ఓల్డ్ ట్రాఫర్డ్, ఓవల్ మైదానాల్లో వారు ఘోరంగా దెబ్బతిన్నారు. ఒక కసాయి వాడి దగ్గరికి గొర్రెల మాదిరిగా భారత్ ప్రదర్శన సాగింది' అని బాయ్ కాట్ ఎద్దేవా చేశారు.

 

గత శీతాకాలం ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్ లను ఇంగ్లండ్ అభిమానులు జీర్ణించుకోలేకపోయినా.. ఈ సిరీస్ మాత్రం వారిలో అమితమైన ఆనందాన్ని నింపిందని బాయ్ కాట్ స్పష్టం చేశాడు. ఆ సీజన్ లో ఇంగ్లండ్ తొందరగా మ్యాచ్ లను ముగించిన తీరును ఈ సందర్భంగా ప్రస్తావించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement