వైజాగ్‌లో ఇంగ్లండ్ టెస్టు | Bangladesh match in Hyderabad | Sakshi
Sakshi News home page

వైజాగ్‌లో ఇంగ్లండ్ టెస్టు

Published Fri, Jun 10 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

Bangladesh match in Hyderabad

హైదరాబాద్‌లో బంగ్లాదేశ్ మ్యాచ్
సిరీస్‌లకు వేదికలు ఖరారు
 

ముంబై: ఈ సీజన్‌లో భారత్ జట్టు స్వదేశంలో ఆడబోయే సిరీస్‌లకు వేదికలు ఖరారయ్యాయి. గతేడాది నవంబరులో టెస్టు హోదా సంపాదించిన వైజాగ్ తొలిసారిగా ఇంగ్లండ్, భారత్‌ల టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. రాజ్‌కోట్, పుణే, ధర్మశాల, రాంచీ, ఇండోర్‌లకు కూడా ఈ సీజన్‌లో తొలిసారి టెస్టు మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం లభించింది. అలాగే బంగ్లాదేశ్ జట్టు భారత్‌తో ఆడే ఏకైక టెస్టు మ్యాచ్‌కు హైదరాబాద్ వేదిక కానుంది.

ఈ సీజన్లో భారత్ స్వదేశంలో 13 టెస్టులు, 8 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు ఆడనుంది. తొలుత న్యూజిలాండ్, ఆ తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు భారత్‌లో పర్యటిస్తాయి. అలాగే దేశంలో తొలిసారి డేనైట్‌గా ఈడెన్‌గార్డెన్స్‌లో నిర్వహించాలని భావిస్తున్న టెస్టు న్యూజిలాండ్‌తో జరిగే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement