హైదరాబాద్: తన క్రికెట్ కెరీర్‌లో చేసిన తప్పిదాలను రోహిత్ శర్మ చేయకూడదని దిగ్గజ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ సూచించాడు. తనకు టెస్టుల్లో పెద్దగా ఓపెనింగ్ అనుభవం లేకపోయినా, ఓపెనింగ్‌కు వెళ్లి విఫలమైన సంగతిని లక్ష్మణ్ గుర్తు చేసుకున్నాడు. కేవలం నాలుగు టెస్టులు మాత్రమే ఆడిన తర్వాత తనను ఓపెనర్‌గా ప్రయోగం చేశారన్నాడు. అది మంచి ఫలితాన్ని ఇవ్వలేదన్నాడు.
‘ఓపెనింగ్‌లో రోహిత్ శర్మ నేనే చేసినట్లుగా పొరపాట్లు చేయకూడదు. ఇప్పుడైతే అతడికి అనుభవమే అతిపెద్ద సానుకూలత. మంచి ఫామ్‌లో ఉన్నాడు. అప్పట్లో (1996–98 సీజన్) నాకు అనుభవమే లేదు. అంతకుముందు మిడిలార్డర్‌లో నాలుగు టెస్టులే ఆడా. అంతలోనే ఓపెనింగ్‌కు పంపారు. టెక్నిక్ మార్చి బ్యాటింగ్ చేసి విఫలమయ్యా. రోహిత్... ఆర్డర్ మారినా, బ్యాటింగ్ సూత్రాలు, క్రీజులో నిలిచే దిశను మార్చుకోవద్దు. ఫ్రంట్ ఫుట్, బ్యాక్ ఫుట్‌పై కచ్చితమైన మైండ్‌సెట్‌తో ఆడాలి’ అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment