హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ ఎదిగిన తీరును ప్రధానంగా కొనియాడాడు. రోహిత్ శర్మకు ఒత్తిడిలో మ్యాచ్‌లు ఆడటం బాగా తెలుసంటూ కితాబిచ్చాడు. పరిస్థితుల్ని అంచనా వేసుకుంటూ ఆడటంలో రోహిత్ దిట్ట అని ప్రశంసించాడు. దీనిలో భాగంగా ఐపీఎల్ అరంగేట్రం సీజన్‌లో రోహిత్ డెక్కన్ చార్జర్స్‌కు ఆడటాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. యువకుడిగా ఉన్నప్పట్నుంచీ రోహిత్ ఒత్తిడిలో మ్యాచ్‌లను సమర్ధవంతంగా ఆడాడన్నాడు. ‘2008లో డెక్కన్ చార్జర్స్ విజయాల్లో రోహిత్ ముఖ్య భూమిక పోషించాడు. (సౌరవ్ గంగూలీ రేసులో లేడు..కానీ)
ఆ సమయంలోనే జట్టుకు సారథ్యం వహించే లక్షణాలు అలవర్చుకున్నాడు. అప్పుడు రోహిత్ ఒక యువ క్రికెటర్. కేవలం టీ20 వరల్డ్‌కప్ ఆడిన అనుభవం మాత్రమే ఉంది. ఆ సీజన్‌లో రోహిత్ మిడిల్ ఆర్డర్‌లో తీవ్ర ఒత్తిడిలో ఆడాడు. మా జట్టులోని మిగతా ఆటగాళ్లు పెద్దగా ఆడకపోయినా రోహిత్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అప్పుడు మేము ఆడిన ప్రతీ సక్సెస్‌లోనూ రోహిత్ పాత్ర ఉంది. తన ఆత్మవిశ్వాసం లెవల్స్‌ను క్రమేపి పెంచుకుంటూ కీలక పాత్ర పోషించాడు. దాంతో జట్టు ప్రయోజనాల కోసం తన వాయిస్‌ను కూడా వినిపించేవాడు. జట్టు ఎప్పుడు కష్టాల్లో పడ్డా నేనున్నాంటూ ఆదుకునేవాడు. అప్పుడే రోహిత్‌లో బ్యాటింగ్ పరిమళించింది. ప్రధానంగా ఐపీఎల్‌లో ఒక సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా రోహిత్ ఉన్నాడంటే అందుకు కారణంగా ఒత్తిడిని జయించే లక్షణాలు రోహిత్‌లో పుష్కలంగా ఉండటమే’ అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.(రిస్క్ చేద్దామా.. వద్దా?)
Comments
Please login to add a commentAdd a comment