పుణే: ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేలో భారత్ కాస్త తడబడినప్పటికీ ఎట్టకేలకు గెలుపొంది, సిరీస్ గెల్చుకున్న విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆటగాళ్లను ఇంగ్లండ్ స్పినర్లు పెవిలియన్‌కు చేర్చారు. ఈ నేపథ్యంలో స్పినర్లను ఎదుర్కోవడంలో టీమిండియా ఆటగాళ్లు ఇబ్బంది పడటం స్పష్టంగా కనిపించిందని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇది ఒకింతా విస్మయాన్ని గురిచేసిందని తెలిపాడు. సాధారణంగా భారత బ్యాట్స్‌మెన్లకు స్పిన్నర్లను ఎదుర్కొవడం సులువైన పని అని గుర్తుచేశాడు.
స్వదేశంలో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై భారత ఆటగాళ్ల ఆట తీరును పునః సమీక్షించుకోవాలని వ్యాఖ్యనించాడు. ఈ ధోరణి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించాడు. ఈ మూస పద్ధతికి స్వస్తి పలకాలని వీవీఎస్ హితవు పలికాడు. కాగా, భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, కెప్టెన్ విరాట్ కోహ్లి ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేలో తమ వికెట్లను ఇంగ్లండ్ స్పిన్నర్లు మొయిన్ ఆలీ , అదిల్ రషీద్‌లకు సమర్పించుకున్న విషయం తెలిసిందే. చివరి వన్డేలో ఇంగ్లండ్ బౌలర్లు భారత్‌ను 48.2 ఓవర్లకే కుప్పకుల్చారు. ఇంగ్లండ్ స్పిన్ బౌలర్లు మొయిన్ ఆలీ(1/31), అదిల్ రషీద్(2/81), లివింగ్ స్టోన్(1/20) వికెట్లు తీశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లిని అత్యధికసార్లు ఔట్ చేసిన జాబితాలో మొయిన్ అలీ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఇక గ్రేమ్ స్వాన్, జేమ్స్ అండర్సన్, బెన్ స్టోక్స్‌లు కోహ్లిని ఎనిమిదిసార్లు ఔట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లిని అత్యధిక సార్లు ఔట్ చేసింది టిమ్ సౌతీ.
టీమిండియా టాపార్డర్ తీరుపై వీవీఎస్ అసంతృప్తి!
Published Mon, Mar 29 2021 1:02 PM | Last Updated on Mon, Mar 29 2021 6:16 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment