చెన్నై: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ అజింక్య రహానేలు విఫలమైన సంగతి తెలిసిందే. రోహిత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 6,12 పరుగులు చేయగా.. రహానే 1, 0 పరుగులతో పూర్తిగా తేలిపోయాడు. ఈ నేపథ్యంలో వారిద్దరు ఆటతీరు తనను తీవ్రంగా నిరాశపరిచిందని టీమిండియా మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు.
లక్ష్మణ్ మాట్లాడుతూ..' ఫిబ్రవరి 13 నుంచి జరగనున్న రెండో టెస్టులోనైనా రోహిత్ శర్మ, అజింక్య రహానేల నుంచి మంచి కమిట్‌మెంట్‌ను చూడాలనుకుంటున్నా. ఈ ఇద్దరూ మ్యాచ్‌ని గెలిపించాలి లేదా కాపాడాలని కోరుకుంటున్నా. తొలి టెస్టులో రహానెలో నాకు ఏమాత్రం పోరాట పటిమ కనబర్చలేదు. అండర్సన్ బంతి నుంచి రివర్స్ స్వింగ్ రాబడుతున్నాడని తెలిసినా.. ఏమాత్రం ఫుట్‌వర్క్ లేకుండా బంతిని ఎదుర్కొని రహానే బౌల్డయ్యాడు. స్పిన్నర్ జాక్ లీచ్ బౌలింగ్‌ను అంచనా వేయలేక రోహిత్ శర్మ ఆఫ్ స్టంప్‌ని వదిలేయడంతో క్లీన్‌బౌల్డయ్యాడు. రెండో టెస్టులో ఇద్దరూ జాగ్రత్తగా ఆడాలని' లక్ష్మణ్ సూచించాడు. ఇక తొలి టెస్టులో టీమిండియా 227 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కాగా రెండో టెస్టులో షాబాజ్ నదీమ్ స్థానంలో అక్షర్ పటేల్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
చదవండి: రెండో టెస్టుకు ఇంగ్లండ్ కీలక బౌలర్ దూరం
'కోహ్లి కెప్టెన్సీ అంటే చాలా ఇష్టం'
Comments
Please login to add a commentAdd a comment