
న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా విరాట్ కొహ్లీ మరో ఘనతను సాధించారు. వరుసగా అత్యధిక టెస్టు సిరీస్‌ల గెలుపు విషయంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును కొహ్లీ సమం చేశారు. శ్రీలంకతో న్యూఢిల్లీలో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ 1 - 0 తేడాతో కైవసం చేసుకుంది.
కెప్టెన్‌గా కొహ్లీకి ఇది వరుసగా తొమ్మిదో టెస్టు సిరీస్ విజయం. 2005 నుంచి 2008 మధ్య కాలంలో పాంటింగ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు వరుసగా తొమ్మిది సిరీస్‌లలో ప్రత్యర్థులను మట్టికరిపించింది. ఇంగ్లండ్ జట్టు కూడా 1884 నుంచి 1892 మధ్యకాలంలో తొమ్మిది టెస్టు సిరీస్‌లలో విజయాలు సాధించింది. 2015లో టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన విరాట్ కొహ్లీ తొలి టెస్టు సిరీస్‌ను శ్రీలంకపైనే గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment