![కివీస్ కు కలిసొచ్చిన 2014 - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/71419833556_625x300.jpg.webp?itok=c5US3TUj)
కివీస్ కు కలిసొచ్చిన 2014
క్రిస్ట్ చర్చ్: న్యూజిలాండ్ క్రికెట్ కు 2014వ సంవత్సరం కలిసొచ్చింది. ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా కివీస్ ఈ సంవత్సరం అత్యధిక టెస్ట్ విజయాల్ని నమోదు చేసింది. తాజాగా శ్రీలంతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయాన్ని సాధించడంతో ఆ ఘనతను అందుకుంది.
నాల్గో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ల్ లో 105 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 30.4 ఓవర్లలో విజయాన్ని సాధించింది.దీంతో ఒక క్యాలెండర్ ఇయర్ లో ఐదు టెస్టు మ్యాచ్ ల్లో విజయాన్ని సాధించిన అరుదైన ఘనతను తమ సొంతం చేసుకుంది.