SAFF Championship: Pakistan to reach Bengaluru 10 hours before kick-off - Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు భారత్‌కు చేరుకోనున్న పాకిస్తాన్‌ జట్టు.. రేపే మ్యాచ్‌!

Published Tue, Jun 20 2023 4:16 PM | Last Updated on Tue, Jun 20 2023 4:37 PM

Pakistan to reach Bengaluru 10 hours before kick off - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో పాల్గొనేందుకు పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు ఇండియాకు వస్తుందో రాదో సృష్టత లేదు గానీ ఆ దేశ ఫుట్‌బాల్‌ జట్టు మాత్రం భారత గడ్డపై అడుగుపెట్టనుంది.  దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గోనేందుకు పాకిస్తాన్‌ ఫుట్‌బాల్‌ జట్టు బుధవారం(జూన్‌ 21) ఇండియాకు చేరుకోనుంది. ఈ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా తొలి మ్యాచ్‌  ఛాంపియన్‌షిప్‌లో బెంగళూరు వేదికగా భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్యే జరగనుంది.

వాస్తవానికి పాకిస్తాన్‌ జట్టు రెండు రోజుల ముందే భారత్‌ చేరుకోవాల్సిండగా.. వీసా సమస్య కారణంగా వారి ప్రయాణం ఆలస్యమైంది. కాగా పాకిస్తాన్‌ జట్టు ప్రస్తుతం మారిషస్‌లో ఉంది. అయితే ఎట్టకేలకు వారికి వీసా క్లియరన్స్‌ రావడంతో మంగళవారం భారత్‌కు పయనం కానున్నారు. మంగళవారం సాయంత్రం 5: 30 గంటలకు మారిషస్‌లో బయలు దేరనున్న పాక్‌ జట్టు.. అదే రాత్రి(బుధవారం) ఒంటి గంటకు ముంబైకు చేరుకోనుంది.

అక్కడ నుంచి నేరుగా మ్యాచ్‌ జరిగే బెంగళూరుకు వెళ్లనున్నారు. ఈ మ్యాచ్‌ బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జూన్‌ 21 సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభం కానుంది. ఇక దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఛాంపియన్‌షిప్‌-2023లో మొత్తం ఆరు జట్లు పాల్గొనున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఏలో  భారత్, కువైట్, నేపాల్, పాకిస్థాన్  జట్లు ఉండగా.. గ్రూపు-బిలో లెబనాన్, మాల్దీవులు, భూటాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి.
చదవండి: Shoaib Akhtar ‘Daughter’: 2014లో పెళ్లి.. ఇంత పెద్ద కూతురు ఎలా? హీరోయిన్‌లా మెరిసిపోతోంది! ఎంతైనా అక్తర్‌..
                   MS Dhoni: రోహిత్‌ వద్దే వద్దు!.. నాడు బీసీసీఐ ధోనిని ఎందుకు కెప్టెన్‌ను చేసిందంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement