Pakistan football team
-
చెప్పినా వినలేదు.. పాకిస్తాన్‌కు భారీ షాక్!
అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (FIFA) పాకిస్తాన్ ఫుట్‌బాల్ సమాఖ్యపై సస్పెన్షన్ వేటు వేసింది. ‘ఫిఫా’ నియమావళికి అనుగుణంగా పాక్ ఫుట్‌బాల్ సమాఖ్య (PSF) నిర్వహణ జరగకపోవడంతో ‘ఫిఫా’ శుక్రవారం ఆ దేశ సమాఖ్యపై నిషేధం విధించింది. ‘ఫిఫా’ నియమావళి ప్రకారం నడుచుకునేలా పీఎఫ్ఎఫ్ నిబంధనల్ని సవరించుకోవాలని.. తద్వారా దేశంలో ఆటపై జవాబుదారీతనం పెరగాలని ‘ఫిఫా’ పలు సూచనల్ని చేసినా... పీఎఫ్ఎఫ్ పెడచెవిన పెట్టింది. నిషేధాజ్ఞలుంటాయని హెచ్చరించినా సవరణలు చేయకపోవడంతో ‘ఫిఫా’ తాజాగా సమాఖ్యను సస్పెండ్ చేసింది.అదే విధంగా తాము సూచించిన సవరణలు పూర్తి చేసేదాకా నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. 2019 జూన్‌లో ‘ఫిఫా’ నియమించిన కమిటీనే పీఎఫ్ఎఫ్ వ్యవహారాలను చక్కబెడుతోంది. కానీ హరూన్ మాలిక్ నేతృత్వంలోని ఈ కమిటీని అక్కడి ప్రభుత్వం శాసించడంతో ఎన్నికల నిర్వహణ, నిబంధనల్లో సవరణల ప్రక్రియ మాత్రం చేపట్టలేకపోయింది.ఈ నేపథ్యంలో హరూన్ తమపై వేటు తప్పదని ఇటీవల పార్లమెంటరీ ప్యానెల్ దృష్టికి తెచ్చినా అక్కడి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ‘ఫిఫా’ నియమావళికి తగ్గ మార్పుచేర్పులకు పాక్ ప్రభుత్వ ఆజమాయిషీలోని సమాఖ్య సిద్ధంగా లేదని హరూన్ మాలిక్ ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ‘ఫిఫా’ కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. 2017 నుంచి పాక్ సమాఖ్యపై వేటు పడటం ఇది మూడోసారి! మరిన్ని క్రీడావార్తలు40 ఏళ్ల వయసులో 40 పాయింట్లు!.. లెబ్రాన్ జేమ్స్ కొత్త రికార్డు లాస్ఏంజెలిస్: అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్ ప్రతిష్టాత్మక నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) లీగ్‌లో అరుదైన ఘనతను నమోదు చేశాడు. ఒక ఎన్బీఏ గేమ్‌లో 40కి పైగా పాయింట్లు సాధించిన అతి పెద్ద వయస్కుడిగా అతను నిలిచాడు. గురువారం లెబ్రాన్ గోల్డెన్ స్టేట్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 120–112 పాయింట్ల తేడాతో లాస్ఏంజెలిస్ లేకర్స్ విజయం సాధించింది. ఇందులో లెబ్రాన్ ఒక్కడే 42 పాయింట్లు సాధించాడు. గత ఏడాది డిసెంబర్ 30న లెబ్రాన్ 40 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. గతంలో ఆల్‌టైమ్ గ్రేట్ మైకేల్ జోర్డాన్ 40 ఏళ్ల 3 రోజుల వయసులో (2003లో వాషింగ్టన్ విజార్డ్స్ తరఫున) ఒక గేమ్‌లో 40కి పైగా పాయింట్లు నమోదు చేశాడు. ఈ రికార్డును ఇప్పుడు లెబ్రాన్ సవరించాడు.పోరాడి ఓడిన రిత్విక్ జోడీ సాక్షి, హైదరాబాద్: డాలస్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ పేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. అమెరికాలోని టెక్సస్‌లో జరుగుతున్న ఈ టోర్నీ పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రిత్విక్ (భారత్)–నికోలస్ బారింటోస్ (కొలంబియా) ద్వయం 6–7 (4/7), 7–5, 6–10తో ‘సూపర్ టైబ్రేక్’లో రాజీవ్ రామ్–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) జంట చేతిలో ఓడిపోయింది.1 గంట 57 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రిత్విక్–బారింటోస్ మూడు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశారు. అయితే నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో అనుభవజ్ఞులైన రాజీవ్ రామ్, క్రాయిసెక్ పైచేయి సాధించి విజయాన్ని ఖరారు చేసుకున్నారు. రిత్విక్–బారింటోస్లకు 11,840 డాలర్ల (రూ. 10 లక్షల 38 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. గత ఏడాది అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్ సర్క్యూట్లో నిలకడగా రాణించిన రిత్విక్ ... గత వారం భారత్–టోగో జట్ల మధ్య న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ గ్రూప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్ ద్వారా డేవిస్ కప్‌లో అరగేంట్రం చేశాడు. -
ఎట్టకేలకు భారత్‌కు చేరుకోనున్న పాకిస్తాన్ జట్టు.. రేపే మ్యాచ్!
వన్డే ప్రపంచకప్-2023లో పాల్గొనేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇండియాకు వస్తుందో రాదో సృష్టత లేదు గానీ ఆ దేశ ఫుట్‌బాల్ జట్టు మాత్రం భారత గడ్డపై అడుగుపెట్టనుంది. దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గోనేందుకు పాకిస్తాన్ ఫుట్‌బాల్ జట్టు బుధవారం(జూన్ 21) ఇండియాకు చేరుకోనుంది. ఈ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఛాంపియన్‌షిప్‌లో బెంగళూరు వేదికగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్యే జరగనుంది. వాస్తవానికి పాకిస్తాన్ జట్టు రెండు రోజుల ముందే భారత్ చేరుకోవాల్సిండగా.. వీసా సమస్య కారణంగా వారి ప్రయాణం ఆలస్యమైంది. కాగా పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం మారిషస్‌లో ఉంది. అయితే ఎట్టకేలకు వారికి వీసా క్లియరన్స్ రావడంతో మంగళవారం భారత్‌కు పయనం కానున్నారు. మంగళవారం సాయంత్రం 5: 30 గంటలకు మారిషస్‌లో బయలు దేరనున్న పాక్ జట్టు.. అదే రాత్రి(బుధవారం) ఒంటి గంటకు ముంబైకు చేరుకోనుంది. అక్కడ నుంచి నేరుగా మ్యాచ్ జరిగే బెంగళూరుకు వెళ్లనున్నారు. ఈ మ్యాచ్ బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జూన్ 21 సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభం కానుంది. ఇక దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్-2023లో మొత్తం ఆరు జట్లు పాల్గొనున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఏలో భారత్, కువైట్, నేపాల్, పాకిస్థాన్ జట్లు ఉండగా.. గ్రూపు-బిలో లెబనాన్, మాల్దీవులు, భూటాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. చదవండి: Shoaib Akhtar ‘Daughter’: 2014లో పెళ్లి.. ఇంత పెద్ద కూతురు ఎలా? హీరోయిన్లా మెరిసిపోతోంది! ఎంతైనా అక్తర్.. MS Dhoni: రోహిత్ వద్దే వద్దు!.. నాడు బీసీసీఐ ధోనిని ఎందుకు కెప్టెన్‌ను చేసిందంటే.. CONFIRMED: The Pakistan NT will leave Mauritius at 5:30pm & reach Mumbai at 1am IST tomorrow. The flight to BLR is around 6am & will land at 8. Then comes the trip from the airport to the hotel, amid the rains. Going to be tough, esp. since rescheduling looks unlikely. #SAFF2023 pic.twitter.com/hpBpFvvd2q — Shyam Vasudevan (@JesuisShyam) June 20, 2023 -
భారత్ పర్యటనకు పాక్ ఫుట్‌బాల్ జట్టు!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఫుట్‌బాల్ జట్టు భారత్‌లో ఆడేందుకు రంగం సిద్ధమైంది. డిసెంబర్లో జరగనున్న ‘శాఫ్’ కప్ కోసం పొరుగుదేశం జట్టు ఇక్కడికి రానుంది. అయితే ఇరుదేశాల మధ్య క్రికెట్ సిరీస్‌లపై నీలినీడలు కమ్ముకున్నా... పాక్ ఫుట్‌బాల్ జట్టు కు మాత్రం అనుమతి లభిస్తుందని ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఇటీవల న్యూఢిల్లీలో తీసిన టోర్నీ డ్రాలో భారత్, పాక్ ఒకే గ్రూప్‌లో ఉండటంతో ఈ రెండు జట్లు కలిసి మ్యాచ్‌లు ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు జరిగిన ఈ దక్షిణాసియా చాంపియన్‌షిప్‌కు పాకిస్తాన్ ఒక్కసారి కూడా గైర్హాజరు కాలేదు. డిసెంబర్ 23 నుంచి జనవరి 3, 2016 వరకు తిరువనంతపురంలో ఈ టోర్నీ జరగనుంది. మరోవైపు పాక్ ఆటగాళ్లు హెచ్ఐఎల్లో పాల్గొనేలా హెచ్ఐతో చర్చలు జరుపుతామని పాక్ హాకీ సమాఖ్య (పీహెచ్ఎఫ్) కార్యదర్శి సుభాన్ అహ్మద్ తెలిపారు. ఆటను మెరుగు పర్చుకోలేకపోవడంతో పాటు పెద్ద మొత్తం లో వచ్చే డబ్బును పాక్ ఆటగాళ్లు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా పాక్ ఆటగాళ్ల మితిమీరిన ప్రవర్తన కారణంగా వాళ్లను హెచ్ఐఎల్కు దూరంగా పెట్టారు.