బెంగుళూరు : ఇస్రో అధికారులు ఎల్లప్పుడు అంతరిక్షంలోకి శాటిలైట్లను, రాకెట్లను పంపే పనిలో బిజీగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగుళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశ ముగింపు కార్యక్రమాన్ని ఒక సీనియర్ అధికారి తన ప్లూట్ పరికరంతో సంగీతం వినిపించి ముగించారు. వివరాల్లోకి వెళితే.. ప్రతి ఏడాది చివరలో బెంగుళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిర్వహిస్తుంటారు.
ఇస్రో చైర్మన్ కె. శివన్ ఆధ్వర్యంలో ఈసారి కూడా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కార్యక్రమం చివర్లో ఇస్రో డైరెక్టర్, సీనియర్ సైంటిస్ట్ పి. కున్హికృష్ణన్ తన వెంట తెచ్చుకున్న ప్లూట్ పరికరంతో 'వాతాపి గణపతిం భజే' పాటను అందరికి వినిపించారు. .అయితే ఈ వీడియోనూ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ తన ట్విటర్‌లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ' స్వతహాగా ప్రొఫెషనల్ ప్లూట్ వాయిద్యకారుడైన ఇస్రో డైరక్టర్ పి. కున్హికృష్ణన్ ఈరోజు తన ప్లూట్‌తో మ్యాజిక్ చేశారు. ఆయన 'వాతాపి గణపతిం భజే' పాటను వినిపించి ఇస్రో పార్లమెంటరీ సమావేశాన్ని ముగించడం నాకు ఆనందం కలిగించింది. ఆ సమయంలో పార్లమెంటరీ సమావేశం కాస్తా ఒక సంగీత విభావిరి కేంద్రంగా మారిందంటూ' ట్వీట్ చేశారు.
The Parliamentary Standing Committee ended it's last meeting at ISRO with a flute performance by the Director of its Satellite Centre in Bengaluru, P. Kunhikrishnan, who is also a professional flute player! He played the evergreen Vatapi Ganapatim Bhaje. Sharing a snippet. pic.twitter.com/AkwwPh9oZY
— Jairam Ramesh (@Jairam_Ramesh) December 29, 2019
Comments
Please login to add a commentAdd a comment