
యశవంతపుర(బెంగళూరు): బస్టాండ్‌లో బ్యాగ్, మొబైళ్లు చోరీ కావటం వినే ఉంటాం. అయితే ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన బస్సును దుండగులు ఎత్తుకెళ్లారు. వివరాలు... కల్యాణ కర్ణాటక రవాణాసంస్థ (కెకె ఆర్టీసీ) బస్సు చోరీకి గురైంది. కలబురిగి జిల్లా చించోళి బస్టాండ్‌లో బీదర్ డిపో–2కు చెందిన బస్ (కెఎ–38, ఎఫ్–971)ను సోమవారం రాత్రి నిలిపారు.
మంగళవారం తెల్లవారుజామున బస్సును దుండగులు అపహరించారు. ఈ బస్సును ముగ్గురు వ్యక్తులు మిరియాణ, తాండూరు మార్గంలో తెలంగాణ వైపు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. చించోళి పోలీసులు ఆర్టీసీ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి బస్సు కోసం గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment