
బెంగళూరు: కరోనా కరాళనృత్యానికి కుటుంబాలే తుడిచిపెట్టుకుపోతున్నాయి. అలాంటిదే ఇది. కరోనా కర్కశత్వానికి ఇదో మచ్చుతునక. కర్ణాటకలోని మాండ్యా జిల్లాకు చెందిన నంజుండే గౌడ, మమత దంపతులు. పిల్లలు కలగకపోవడంతో మొక్కని దేవుడు లేడు. చేయని పూజ లేదు. ఎట్టకేలకు తొమ్మిదేళ్ల తర్వాత మమత గర్భవతి అయ్యింది. వారి ఆనందానికి అవధుల్లేవు. నెలలు నిండాయి.. ఇంతలో ఊహించని ఉత్పాతం. దంపతులిద్దరికీ కరోనా సోకింది. పాప పుట్టడానికి ఐదురోజుల ముందు తండ్రి చనిపోయారు.
ఆడబిడ్డకు జన్మనిచ్చిన మమత తమ గారాలపట్టిని తనివిదీరా చూసుకొనే భాగ్యానికి నోచుకోలేదు. బిడ్డపుట్టిన ఐదురోజులకు మమత ప్రాణాలు విడిచింది. పాపకూ కరోనా సోకినా ఇప్పుడా చిట్టితల్లి కోలుకుంటోంది. 12 రోజుల ఈ చిన్నారికి వచ్చిన కష్టం తెలిసి... ఎంతోమంది కంటతడి పెడుతున్నారు. ఈ పాపను పెంచుకునేందుకు మమత సోదరుడు ముందుకువచ్చాడు. తమకు ఇద్దరు పిల్లలున్నారని, మూడోబిడ్డగా ఈ చిన్నారిని పెంచుకుంటామని సోదరుడు, ఆమె భార్య తెలిపారు.
(చదవండి: Uddhav Thackeray: గాలిలో చక్కర్లు కొట్టలేదు కదా!)
Comments
Please login to add a commentAdd a comment