ప్రతీకాత్మక చిత్రం
ముంబై : ఆటోలో ప్రయాణించే ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. బెంగుళూరుకు చెందిన ఓ టెకీ ఉద్యోగ రీత్యా పూణెలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో తన నివాసం నుంచి ఆఫీస్‌కు వెళ్లడానికి బుధవారం ఉదయం కాట్‌రాజ్ ప్రాంతం వరకు బస్సులో వచ్చాడు. అక్కడి నుంచి తన కార్యాలయం ఉన్న ఎరవాడ ప్రాంతం 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమయానికి బస్సులు రాకపోవడంతో క్యాబ్ బుక్ చేసుకుందాం అనుకొని చూస్తే క్యాబ్‌లు కూడా అందుబాటులో లేకపోడంతో ఆటో మాట్లాడుకొని వెళ్లాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడే అసలు కథ మొదలైంది.
ఆఫీస్ వద్ద ఆటో దిగగానే మీటర్‌పై ధర చూసిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి షాక్‌కు గురయ్యాడు. తను ఆటోలో ప్రయాణించిన దూరం కేవలం 14.5 కిలోమీటర్లు మాత్రమే. అయితే నమ్మశక్యం కాని విధంగా మీటర్‌పై రూ. 4300 బిల్లు కనిపించింది. దీంతో కంగుతిన్న సదరు టెకీ ఇదేంటని.. డ్రైవర్‌ను ప్రశ్నించగా.. పూర్తి డబ్బులు చెల్లించాల్సిందేనని అతడు దబాయించాడు. అనంతరం డ్రైవర్‌ను నిలదీయగా తను(ఆటో) నగరంలోకి ప్రవేశించడానికి రూ. 600, తిరిగి వెళ్లడానికి రూ.600 కట్టవలసి ఉంటుందని, మిగతావి తన ప్రయాణానికి అయిన డబ్బులని అసలు విషయం బయటపెట్టాడు. దీంతో చేసేదేం లేక మొత్తం డబ్బులు కట్టేశాడు. అనంతరం ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment