ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఓ సభలో 81 ఏళ్ల చరిత్రకారుడిపై దాడి జరిగింది. అర్హతలేని వ్యక్తిని వచనకారుడిగా పేర్కొంటూ జయంతి వేడుకల్ని నిర్వహించడంపై నిరసన తెలపడమే గలాటాకు కారణమైంది.
వచనకారుడు, శివ భక్తుడిగా పేరొందిన దివంగత దేవర దశిమయ్య జయంతి వేడుకల్ని బుధవారం బెంగళూరులోని విధాన సౌధలో నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. అయితే దేవర దశిరామయ్య అసలు వచనాలే రాయలేదని, జేదార దశిరామయ్యే అసలు వచనకారుడని, పేర్లు గుర్తించడంలో ప్రభుత్వం పొరపాటుకు గురైందని చరిత్రకారుడు, రచయిత ఎం చిదానందమూర్తి ఆ సభలో కరపత్రాలు పంచేందుకు ప్రయత్నించారు.
చిదానంద చర్యను వ్యతిరేకిస్తూ కొందరు వ్యక్తులు ఆయనపై దాడికి దిగారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వేదికపైనే ఉన్నారు. పోలీసులు కలుగజేసుకొని చరిత్రకారుడు, అతని అనునాయుల్ని బయటికి పంపడంతో గొడవ సర్దుమణిగింది.