సీఎంకు అశోక్ సూటిప్రశ్న
మైసూరు: 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను శుద్ధంగా ఉన్నానని వందసార్లు చెప్పిన సీఎం సిద్ధరామయ్య అవినీతికి పాల్పడకుండా శుభ్రంగా ఉంటే సీబీఐ దర్యాప్తునకు ఎందుకు భయపడుతున్నారు? అని ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ నిలదీశారు. ఆయన శుక్రవారం సాయంత్రం నగరంలోని భాజపా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
వాల్మీకి కుంభకోణాన్ని తొక్కిపెట్టేందుకు యత్నించారని, ఈడీ రంగంలోకి దిగగానే తప్పు జరిగిందని ఒప్పుకున్నారన్నారు. పెట్రోల్ బంకులతో పాటు వివిధ వనరుల నుంచి రాష్ట్రానికి చెందిన డబ్బు తెలంగాణ ఎన్నికలకు తరలించారన్నారు. వాల్మీకి కుంభకోణం గురించి సీఎంకు చాలా సమాచారం ఇచ్చానని, అయితే ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సీఎం ప్రజలను మభ్యపెడుతున్నారని ఆర్.అశోక్ మండిపడ్డారు.
ముడా కుంభకోణానికి వ్యతిరేకంగా జేడీఎస్‌తో కలిసి పాదయాత్ర చేస్తున్నామన్నారు. ముడా కుంభకోణంపై మీ సొంత పార్టీ అధ్యక్షుడు మరిగౌడ ఈడీ అధికారులకు లేఖ రాశారు కదా అని గుర్తు చేశారు. అలా అయితే మీ పార్టీ నేత అబద్ధాలు చెబుతున్నారా? అని నిలదీశారు. జనాందోళన సభకు కాంగ్రెస్ నేతలు డబ్బులు ఇచ్చి జనాన్ని తీసుకొచ్చారని అశోక్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment